రెజీనాకు బ్రేక్ ఇవ్వనున్న సుబ్బు

Screen Shot 2015-09-20 at 5.50.47 PM

సాయిధరమ్ తేజ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని సెప్టెంబర్ 24న విడుదలకు సిద్ధమైంది. రెజీనా హీరోయిన్. అందం, అభినయంతో పాటు మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రత్యేకత చాటుకున్న హీరోయిన్. లుక్ వుంది కాని లక్ లేదు. అల్లు శిరీష్ పక్కన నటిస్తే, అల్లు అర్జున్‌తో అవకాశం వస్తుందనుకుంటే అసలు అవకాశాలు లేకుండా పొయాయి. రకూల్ ప్రీత్‌సింగ్ డేట్స్ దొరకక, ఈ సినిమాలో అవకాశం వచ్చింది. గబ్బర్‌సింగ్ సినిమాతో శృతిహాసన్‌ను బిజీ చేసిన హరిష్‌శంకర్, ఈ సినిమాతో రెజీనాను కూడా బిజీ చేస్తాడని తెలుగుప్రేక్షకులు అనుకుంటున్నారు.

Filed Under: సుబ్రమణ్యం ఫర్ సేల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *