‘రేయ్‌’ డాన్సు హైలైట్‌

REY

సాయి ధర్మ్ తేజ్ తొలి సినిమా ‘రేయ్‌’ రెండో సినిమాగా ఈ నెల 27న విడుదల కానున్న విషయం విదితమే. రెండో సినిమా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ అంచనాల్లేకుండా వచ్చి సూపర్ హిట్టయ్యింది. సినిమా పూర్తయి చాలా రోజులు విడుదలకు నోచుకోని ‘రేయ్‌’ సినిమాపై రోజు రోజుకు క్రేజ్‌ పెరుగుతుండటం దర్శకనిర్మాత వై.వి.యస్ అదృష్టంగా చెప్పుకోవచ్చు.

‘పిల్లా నువ్వు లేని జీవితం’లో డాన్సులతో అదరగొట్టిన సాయిధరమ్‌ తేజ, అసలు సిసలు డాన్సులు ‘రేయ్‌’లో వేసేశాడు. ఆ డాన్సుల సంగతేంటో టీజర్స్‌ చూస్తేనే అర్థమవుతుంది. ‘గోలీమార్‌’ పాటతోపాటు టైటిల్‌ సాంగ్‌ కూడా దుమ్మురేపింది. దాదాపు అన్ని పాటల్లోనూ సాయిధరమ్‌తేజ డాన్సులు అదరగొట్టేశాడట. ఇప్పుడు ఈ డాన్సులే సినిమాకి హైలైట్‌.

Filed Under: Mega FamilyFeaturedTeluguరేయ్