‘రేయ్’ – క్లైమాక్స్ సాంగ్ హైలైట్

launch-reypawanismsong61

యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ మేనమామ మెగాస్టార్ చిరంజీవి గారి దారిలో హీరో అవ్వడమే కాకుండా ఆయనలోని మానరిజమ్స్ ని, డాన్సింగ్ స్టైల్ ని పుణికి పుచ్చుకున్నాడు. సాయి ధరమ్ తేజ్ నటించిన మొదటి సినిమా ‘రేయ్’. రెండో సినిమాగా మార్చి 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అందులో భాగంగా ఈ సినిమా గురించి పలు విశేషాలు:

ప్రశ్న) మొదటి నుంచి మీరు హీరో అవ్వాలనుకున్నారా.? అసలు ఈ ‘రేయ్’ సినిమా ఎలా మీ దగ్గరికి వచ్చింది.?
స) నాకు మొదట్లో ఏమవ్వాలో అస్సలు క్లారిటీ లేదు. ఆ టైంలో చాలా భయపడేవాన్ని.. నేను ఎం.బి.ఏ చదివే రోజుల్లో అనిపించింది యాక్టర్ ఎందుకు కాకూడదు. ఫస్ట్ నేను హీరో గా కాకుండా ఒక యాక్టర్ అవుదాం అనుకున్నాను. అలా అయితే నేను పోలీస్, బేవార్స్, స్టూడెంట్,మల్టీ మిలినియర్ ఇలా ఏం కావాలనుకున్నా అవ్వచ్చు కదా అని యాక్టింగ్ కోర్సు చేసాను. కానీ హీరోని అయిపోయా.. ఇక రేయ్ సినిమా విషయానికి వస్తే నేను యాక్టింగ్ కోర్సు జాయిన్ అవ్వక ముందు.. నేను క్రికెట్ ఆడుతుండే చౌదరి గారు నన్ను చూసి హీరోగా చేస్తావా అని అడిగారు. లేదండి మా ఫ్యామిలీ వారు ఆ ప్రయత్నాల్లో ఉన్నారని చెప్పడంతో ఎవరు ఏంటని కనుక్కొని వెళ్ళారు. ఆ ఆతర్వాత ఆయనే పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని కలిసి కథ చెప్పి ఫైనలైజ్ చేసుకొని నా దగ్గరికి వచ్చాడు. నేను ఆయనతో సినిమా అనగానే కథ కూడా వినకుండా ఆయన ఏం చెప్తే అది చేసేద్దాం అన్నాను. కానీ ఆయనే కూర్చోబెట్టి కథ చెప్పారు. బ్యాక్ డ్రాప్, స్టొరీ లైన్ నాకు బాగా నచ్చింది. అంతే సెట్స్ పైకి వెళ్ళిపోయాం..

ప్రశ్న) రేయ్ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి.?
స) ఈ సినిమాలో నేను కరేబియన్ దీవుల్లో పుట్టి పెరిగిన కుర్రాడు. అక్కడి వారి ఎక్స్ ప్రెషన్స్ అన్ని చాలా లౌడ్ గా ఉంటాయి. మనం వాళ్ళ మాటలు వింటే కొట్టడానికి వస్తున్నారేమో అన్నట్టు అనిపిస్తాయి. అది చూసి నేను డైరెక్టర్ గారిని అడిగా ఆయన కొత్తగా ఉంటుంది, కచ్చితంగా ఆడియన్స్ కి నచ్చుతుంది అని చెప్పి చేయించారు.

ప్రశ్న) ఇందులో మీరు కరేబియన్ కుర్రాడి పాత్రలో కనిపిస్తానన్నారు. మరి ఆ పాత్ర కోసం ఎంత వరకు వర్కౌట్ చేసారు.?
స) ఈ సినిమాలో నా పాత్ర చెప్పినప్పుడు చౌదరి గారు విల్ స్మిత్ సినిమాలు, క్రిస్ బ్రౌన్ మ్యూజిక్ వీడియోస్ ఇచ్చి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని కాస్ట్ ట్రై చెయ్యి, అలా చేస్తే నాకు బాగా హెల్ప్ అవుతుందని అన్నారు. అలా ఆ వీడియోస్ చూసి మన తెలుగు వారికి సరిపోయేలా ముందు కొన్ని రిహార్సల్స్ చేసాను. ఇక సెట్స్ పై అయనకి ఎలా కావాలో అలా చాలా క్లియర్ గా చెప్పి ప్రతి సీన్ చేయించుకున్నారు.

ప్రశ్న) మీ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి నుంచి ఏమి నేర్చుకున్నారు.? ఆయనతో పనిచేయడం ఎలా ఉంది.?
స) డైరెక్టర్ వైవి ఎస్ చౌదరి గారికి చాలా ఓపిక.. అలాగే సినిమా అంటే పిచ్చి ప్రేమ. ఎందుకు అన్నాను అంటే నేను ఈ సినిమా చేశా తర్వాత సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా కానీ ఆయన మాత్రం గత నాలుగేళ్ళుగా ఇదే సినిమాపై ఉన్నారు. హ్యాట్సాఫ్ టు చౌదరి గారు. ఇక నటుడిగా ఆయన నుంచి చాలా చేర్చుకున్నాను. ప్రతి సీన్ చేసేటప్పుడు అనుకున్నది రాకపోతే ఆయన పక్కకి తీసుకెళ్ళి ముందు సీన్, తర్వాత సీన్ చెప్పి ఎలా కావాలి ఏం కావాలో మళ్ళీ క్లియర్ గా చెప్పి చేయించుకున్నాడు.

ప్రశ్న) మీ లేడీ విలన్ శ్రద్ధ దాస్ గురించి చెప్పండి.?
స) శ్రద్ధ దాస్ చాలా ప్రొఫెషనల్, హార్డ్ వర్కింగ్ అండ్ ఫోకస్ ఉన్న హీరోయిన్. తనతో కలిసి కాంబినేషన్ సీన్స్ చేసింది ఒక మూడు వారాలే.. కానీ మా కాంబినేషన్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. అందరినీ ఎంటర్టైన్ చేస్తాయి.

ప్రశ్న) రేయ్ సినిమాకి మేజర్ హైలైట్స్ ఏమిటి.?
స) క్లైమాక్స్ సాంగ్ ఈ మూవీకి మేజర్ హైలైట్ అవుతుంది. అలాగే చిరు గారి గోలీమార్ రీమిక్స్ కూడా చాలా పెద్ద హైలైట్ అవుతుంది. ముఖ్యంగా ఆ సాంగ్ లో నన్ను చిరుగారిని కలిసి చూపించారు. అది ఆడియన్స్ కి పెద్ద ట్రీట్.. ఇకపోతే ఇంటర్వల్ బ్లాక్, బ్యాక్ డ్రాప్ చాలా కొత్తగా ఉంటుంది.

ప్రశ్న) రేయ్ సినిమా విడుదలకు ఆలస్యం అవుతున్నప్పుడు ఎలా ఫీలయ్యారు.?
స) డిప్రెస్ గా అయితే ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నా జర్నీలో అదొక భాగం దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తే అదొక స్పూర్తిలా అనిపిస్తుంది, అదే యాక్సెప్ట్ చేయకపోతే డిప్రెస్ అవుతారు. నేను ఈ సినిమా డిలే అవ్వడం వలన బాధ పడలేదు, దాని నుంచి స్ఫూర్తి పొందాను. కెరీర్ స్టార్టింగ్ లోనే ఇలాంటి ఓ దెబ్బ తగలడం నాకు ఎంతో అనుభవాన్ని ఇచ్చింది.

ప్రశ్న) మీ ముగ్గురు మామయ్యలతో మీకున్న అనుబంధాన్ని గురించి చెప్పండి.?
స) మా ముగ్గురు మామయ్యలు నా నిజ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రలు పోషించారు. ముందుగా నాగబాబు మామయ్య చిన్నప్పుడు నా స్కూల్ లో నా యాక్టివిటీస్ అన్నీ ఆయనే చూసుకునేవాడు. ఏం కావాలన్నా కొనిచ్చే వాడు. ఆ తర్వాత చిరంజీవి మామయ్య.. నా 8 క్లాస్ నుండి డిగ్రీ వరకు ఆయన దగ్గరుండి చూసుకున్నారు. ఏం చదవాలి, ఎలా చదివితే కెరీర్ బాగుంటుంది అనేది ఆయన చూసుకున్నారు. ఇక కళ్యాణ్ మామయ్య నా కెరీర్ ని తీర్చిదిద్దారు. ఇలా ప్రతి ఒక్కరూ నా లైఫ్లో కీ రోల్స్ ప్లే చేసారు. వాళ్ళు లేకపోతే నేను లేను.

ప్రశ్న) మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకూ వచ్చిన హీరోల నుంచి సినిమా పరంగా లేదా వ్యక్తి గతంగా ఏమేమి నేర్చుకున్నారు.?
స) మెగాస్టార్ చిరంజీవి – ఆయన నుంచి క్రమశిక్షణ, కష్టపడే విధానం నేను నేర్చుకున్నాను. ఒక్కడిగా ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద సామ్రాజ్యం సృష్టించాడు. అది మామూలు విషయం కాదు.
నాగబాబు – ఆయన నుంచి చిరునవ్వు, నిధానం నేర్చుకున్నాను. ఏం జరిగినా, ఎలాంటి సమస్య ఉన్నా నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ ఉంటారు. అలాగే ఏ విషయంలోనూ తొందర ఉండదు, నిధానమే ప్రధానం అన్న రూల్ బాగా ఫాలో అవుతారు.
పవన్ కళ్యాణ్ – కళ్యాణ్ మామయ్య నుంచి నిబద్దత, నిజాయితీ నేర్చుకున్నాను. ఆయనలో ఉన్న నిజాయితీ నేనెక్కడా చూడలేదు. ఏ విషయమైనా ధైర్యంగా మొహం మీద చెప్పేస్తారు. అస్సలు భయపడరు.
రామ్ చరణ్ – చరణ్ గారి గురించి అంటే హి ఈజ్ ది పర్ఫెక్ట్ ప్రిన్స్ టు లెజెండ్ కింగ్(రాజుకి తగ్గ వారసుడు). మెగాస్టార్ లాంటి వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమై ఆయన చేసే సినిమాలతో తండ్రి గారి పేరుని పైకి తీసుకెళ్తున్నారు. ఒక వారసుడు ఏమేమి చెయ్యాలో అవన్నీ చేస్తున్నారు.
అల్లు అర్జున్ – ఇక బన్ని గారిలో ఉండే తపనని నేను అలవరుచుకున్నాను. ఎప్పుడు ఏదో కొత్తగా చెయ్యాలి, ఎలా ప్రేక్షకులను మెప్పించాలి, దాని కోసం నేను ఏమి చెయ్యాలనే నిరంతరం తపన పడుతూ ఉంటారు.

ప్రశ్న) ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెడుతున్నావ్ అనగానే మీ ముగ్గురు మామయ్యలు ఇచ్చిన సలహా ఏమిటి.?
స) మా ముగ్గురు మామయ్యలు నాకు ఒక్కటే చెప్పారు.. నిర్మాతని సేఫ్ జోన్ లో ఉండేలా చూస్కో.. డైరెక్టర్ కి ఏమి కావాలో అది ఇవ్వు అండ్ ముఖ్యంగా అభిమానుల్ని నిరాశాపరచకు అని చెప్పారు. ఇక నటన పరంగా అంటే 100% హార్డ్ వర్క్ చెయ్యి, ఎంచుకున్న పాత్రకి ది బెస్ట్ ఇవ్వు.

ప్రశ్న) మామయ్యలు నిర్మాతని సేఫ్ గా చూస్కోవాలని చెప్పారన్నారు.. మరి ఈ రేయ్ ఆలస్యం అవుతున్నప్పుడు ఖర్చులు పెరుగుతాయని చౌదరికి త్వరగా రిలీజ్ చెయ్యమని చెప్పలేదా.?
స) సినిమా షూటింగ్ అయిపోయి రిలీజ్ అవ్వడానికి ఆలస్యం అవుతున్న టైంలో నేను చాలా సార్లు చౌదరిగారితో ఏదోటి చేసి త్వరగా రిలీజ్ చేసెయ్యండి సార్ అన్నాను.. నేను నెక్స్ట్ సినిమా చేస్తున్నాను మీరు ఇదే సినిమాతో ఉన్నారు అని చెబుతుంటే ఆయన మాత్రం బ్రదర్ ఏం టెన్షన్ పడకు.. ఆలస్యం అయినా సమస్య లేదు.. మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి.. మిగతా అంతా నచ్చితే ఆడియన్స్ చూసుకుంటారు. ఆయనలో కాన్ఫిడెన్స్ చూసి ఆయనకి సపోర్ట్ గా నేను ఉన్నాను. ఆయన కోసమే ఈ సినిమా హిట్ అవ్వాలి.

ప్రశ్న) మెగా కాంపౌండ్ కాకుండా తెలుగులో మీకు నచ్చిన హీరో ఎవరు.?
స) మెగా హీరోస్ కాకుంటే నాకు రవితేజ, ప్రభాస్ అంటే చాలా ఇష్టం. రవితేజ ఎనర్జిటిక్ లెవల్స్ సూపర్బ్.. ఇక ప్రభాస్ అంటారా ఆ కటౌట్ అలాంటిది.(నవ్వుతూ కటౌట్ చూసి కొన్ని కొన్ని నేమ్మేయాలి డ్యూడ్). అందుకే ఆయనన్నా నాకిష్టం..

ప్రశ్న) మీ తదుపరి సినిమా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మరియు నెక్స్ట్ ఓకే చేసిన మూవీస్ గురించి చెప్పండి.?
స) ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ 40% షూటింగ్ పూర్తయ్యింది.. దాని గురించి అంతకన్నా ఏమీ చెప్పలేను.. ఇక నెక్స్ట్ సినిమా అంటే ఇంకా సైన్ చేయలేదు. కొన్ని కథలు వింటున్నా ఇంకా ఏదీ ఫైనలైజ్ చేయలేదు.

SOURCE:
http://www.123telugu.com/telugu/news/interview-sai-dharam-tej-i-learnt-honesty-and-commitment-from-pawan-kalyan.html

Filed Under: Mega FamilyFeaturedTeluguరేయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *