రేయ్ – మాస్ హిట్

Screen Shot 2015-03-07 at 12.52.05 AM

సాయి ధర్మ్ తేజ్ “పిల్లా .. నువ్వు లేని జీవితం” సినిమా ముందు రావడం చాలా మంచిదయినట్టు వుంది. “రేయ్” సినిమా అనుభవం వుండటం వలన “పిల్లా .. నువ్వు లేని జీవితం” సినిమాలో సాయి ధర్మ్ తేజ్ కొత్త హిరోలా అనిపించలేదు.

“రేయ్” రెండో సినిమాగా రావడం కూడా మంచే అయ్యేటట్టు వుంది. ప్రేక్షకులకు బాగా పరిచయం అయిపొయాడు. “పిల్లా .. నువ్వు లేని జీవితం” సినిమా హిట్ అవ్వడంతో పాటు క్లాస్ ప్రేక్షకులకు కూడా నచ్చడంతో సాయి ధర్మ్ తేజ్ హిరోగా మంచి మార్కులే కొట్టేసాడు.

“రేయ్” సినిమాకు క్లాస్ ప్రేక్షకులు దూరంగా వుండవచ్చు. కాని ట్రైలర్ చూస్తుంటే మాస్ హిట్ అయ్యే ఛాన్సస్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఫస్ట్ ట్రైలర్ కంటే లేటెస్ట్ ట్రైలర్ బాగా కట్ చేసారు. మంచి పబ్లిసిటితో, పెట్టుబడి డబ్బులు కొంతలో కొంత వెనక్కి వచ్చే ఛాన్సస్ వున్నాయి.

Filed Under: Mega FamilyFeaturedTeluguరేయ్