రేవంత్ రెడ్డి తప్పు చెయ్యలేదు

Revanth-reddy

ఇది నిజం: రేవంత్ రెడ్డి తప్పు చెయ్యలేదు. రాజకీయ పార్టీలు ఓట్లకు డబ్బులు ఇవ్వడం అనేది, ఓటర్లు తీసుకొవడం పచ్చి నిజం. అది అందరికీ తెలుసు. తెలుగు దేశం పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఓటు కోసం, ఒక ఎం.ఎల్.ఎ కు డబ్బులు ఇచ్చాడు. అధికార పార్టీ తన అధికారాన్ని ఊపయోగించి రేవంత్‌రెడ్డిని కెమెరాల్లొ బంధించి, డైరక్ట్‌గా అధికార పార్టీకి చెందిన మీడియాలో ప్రసారం చేసేసింది. రేవంత్‌రెడ్డి కేవలం పాత్రధారి. డబ్బులు ఇవ్వడం, డబ్బులు తీసుకొవడం అందరికీ తెలిసిన నిజం అయినా, ఇలా డైరక్ట్‌గా రేవంత్‌రెడ్డి లాంటి పెద్ద నాయకుడు ఇవ్వడం అనేది అమాయకత్వం & అతను చేసిన పొరబాటు. శిక్ష పడితే తెలుగుదేశం పార్టీకి పడాలి. కాని రేవంత్‌రెడ్డి బలి అయిపొయే సూచనలు కనిపిస్తున్నాయి.

కేసీఆర్ ఫ్యామిలి పాపం పండే రోజు దగ్గర్లోనే వుంది:
రాష్ట్రం వచ్చేసింది. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ది చేసి ప్రజల మన్నలను పొందవలసిన సమయం. కాని, ఈ ఫ్యామిలికి చెందిన నీచులంతా ప్రాంతం పేరుతోనే రాజకీయాలు చేస్తున్నారు. ప్రత్యర్దులను ప్రాంతం పేరు దూషిస్తూ, ఒకే దేశం అని మర్చిపోతున్నారు. వాళ్ళ సంక నాకే వాళ్ళను మాత్రం నెత్తి మీద పెట్టుకుంటున్నారు. దేవుడు చూస్తూ వూరుకుంటాడనుకుంటే పొరబాటు. పాపం పండే రోజు దగ్గర్లోనే వుంది.

bottomline:
రాజకీయాల్లో ఏమి చేసినా తప్పు కాదని చంద్రబాబు దగ్గరే నేర్చుకొని, చంద్రబాబుకే కేసీఆర్ చుక్కలు చూపిస్తున్నాడు.

కాకపొతే, తమ రాజకీయ ఆదిపత్యం కోసం, రాజకీయ అధికారంతో దోచుకొవడానికి “ప్రజలను ఇబ్బందులు పెట్టడం” “రెచ్చ గొట్టడం” అనే పెద్ద తప్పు చేస్తున్నారు. తీరు మార్చుకొవాలి. ఇప్పటి దాకా చేసిన తప్పులకు శిక్ష పడటం ఖాయం అయినా, తీరు మార్చుకుంటే శిక్ష తగ్గే అవకాశాలు వున్నాయి.

&

“ఓట్లకు డబ్బులు ఇవ్వడం .. ఓటర్లు డబ్బులు తీసుకొవడం ” అనే పక్రియను లీగల్ చెయ్యాలి.

Filed Under: Pawan Kalyan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *