‘రేసుగుర్రం’ టీజర్

resuguram

సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సంధర్భంగా తన సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్కో, టీజరో, ట్రైలరో రిలీజ్ చెయ్యడం మహేష్‌బాబుకు అనవాయితీ.

బాహుబలి హిరో ప్రభాస్ పుట్టినరోజు సంధర్భంగా ప్రభాస్ ఫస్ట్ లుక్కుతో కూడిన మేకింగ్ విడియో ఒకటి, హిరోయిన్ అనుష్క పుట్టినరోజు సంధర్భంగా అనుష్క లుక్కుతో ఒక మేకింగ్ విడియో రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

‘రేసుగుర్రం’ టీం కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు.

అతనొక్కడే, అశోక్, అతిథి, కిక్, ఊసరవెల్లి చిత్రాలతో మాస్‌లోకి చొచ్చుకుపోయిన దర్శకుడు సురేందర్‌రెడ్డి.యాక్షన్ ఎంటర్‌టైనర్లను తెరకెక్కించడంలో బాగా నేర్పు కలిగిన ఆయన ప్రస్తుతం అల్లు అర్జున్‌ని ‘రేసుగుర్రం’గా తీర్చిదిద్దుతున్నారు. నేడు సురేందర్‌రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ దుమ్ము లేపుతూ పరిగెత్తుతున్న ‘రేసుగుర్రం’ టీజర్ రిలీజ్ చేసారు. చాలా బాగుంది. లక్ష్మీనరసింహ ప్రొడక్షన్‌పై నల్లమలపు శ్రీనివాస్‌ (బుజ్జి) నిర్మిస్తున్ను ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Filed Under: Mega FamilyFeatured