రైట్ డైరక్షన్‌లో పవన్‌కల్యాణ్

PK

ప్రజారాజ్యం పార్టీ మెగాస్టార్‌కు, మెగాఫ్యామిలీకి & మెగాఫ్యాన్స్ కు తీవ్ర నష్టాన్ని కలుగజేసింది. అనేక కారణాలు. అందులో ముఖ్యమైనవి 1) ఓవర్ కాన్ఫిడెన్స్, 2) రాజకీయలకోసం ఎంత నీచమైన పనికైనా వెనుకాడని బలమైన ప్రత్యర్దులు & 3) సొంత మీడియా లేకపొవడం.

ప్రజారాజ్యం అంతమొందిన తీరును అవమానంగా భావిస్తున్న మెగాఫ్యాన్స్ ఎవరూ పవన్‌కల్యాణ్ రాజకీయల్లోకి వచ్చి, జనాలను వుద్దరించాలని కోరుకొవడం లేదు.

ప్రజలు నిస్సాహాయులు. ప్రజల హక్కులను డబ్బుతో నాయకులు కోనేసుకుంటున్నారు. ఓటుకు విలువ లేదు.నాయకులు స్వయంగా తాము చేసే పని తప్పు అని, తమకు తాము మారేదాకా ఈ తీరు మారదు.వాళ్ళు మారరు. ఏ ఒక్కరూ మార్చలేరు. రాజకీయలను & రాజకీయ నాయకులను మార్చేద్దాం అనుకునేంత దిక్కుమాలిన ఆలోచన మరొకటి లేదు.

పవన్‌కల్యాణ్ కు ఈ విషయాలు క్షుణంగా తెలుసు. రాజకీయల్లోకి సమాజం కోసం ఎదో చెయ్యాలి చేసేయాలనే గుల కోరిక వుంది. ఆ గుల కోరిక వలన అటు సినిమాలకు న్యాయం చేయలేకపోతున్నాడు.

మొన్న 2014 ఎన్నికల్లో, రెడ్డు కులస్థులు వ్యతిరేకిస్తారని భయం కూడా లేకుండా, రెడ్డు కులస్థులు దైవంగా కొలిచే స్వర్గీయ రాజశేఖర్‌రెడ్డి వారసుడు జగన్‌కు వ్యతిరేకంగా, సొంత కులం వ్యతిరేకించే కమ్మ కుల పార్టీగా పేరొందిన తెలుగుదేశానికి ప్రచారం చేసాడు. కొందరు సొంత కులస్థులు అప్పట్లో వ్యతిరేకించినా, వారి కోపం పవన్‌కల్యాణ్‌ను ద్వేషించే స్థాయికి వెళ్ళలేదు. కాని, కొందరు రెడ్డి కులస్థులు భారీగా ద్వేషించడం మొదలైంది. ఈ స్థాయికి మన రాజకీయాలు దిగజారి పొయాయి. రాజకీయం అంటే కులం. బలమైన కులాలను మాయచేసి మచ్చిక చేసుకొవడమే రాజకీయం. నిజంగా ప్రజల మధ్య ఇంత కులచిచ్చులు వుంటాయా అంటే, వుండవు.

తెలంగాన విషయానికి వస్తే, నోటికి అదుపులేని, సమయాన్ని బట్టి నాలుకను ఎటైనా తిప్పగల కేసీఆర్‌తోనే తలపడ్డాడు.

లక్కీగా పవన్‌కల్యాణ్ సపోర్ట్ చేసిన మోది & చంద్రబాబు ప్రభుత్వాలకు అధికారం వచ్చేసరికి, పవన్‌కల్యాణ్ గౌరవం అమాంతంగా పెరిగిపోయింది. ఫుల్ ఫార్మ్‌లో వున్న కేసీఆర్ & జగన్ లను ధైర్యంగా విమర్శించిన తీరును, తెలుగుదేశం మీడియా ద్వారా ప్రజలు గమనించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో సొంత మీడియా లేనిదే రాజకీయాలు సాధ్యం కాదు. సొంత మీడియా స్థాపించే స్థోమత పవన్‌కల్యాణ్‌కు లేదు. పవన్‌కల్యాణ్ దగ్గర, పవన్‌కల్యాణ్ తండ్రి అక్రమంగా దోచుకున్న సొమ్ములు లేవు. తన స్థాయికి తగ్గట్టు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించనున్నారని అంటున్నారు. ఈ న్యూస్ నిజమైతే, పవన్‌కల్యాణ్ రైట్ డైరక్షన్‌లో వెళ్ళుతున్నట్టే.

  1. నేనొక్కడినే అనుకునే పవన్‌కల్యాణ్ వెంట, ఎంత మంది నమ్మకమైన మనుషులు చేరతారు,
  2. జనసేన అంటే పవన్‌కల్యాణ్ కాదు, జనసేన అంటే పవన్‌కల్యాణ్ ఆలోచనలతో ఏకీభవించే పార్టీ అని, జనసేనను సపోర్ట్ చేసే ప్రజలకు ఎలా తెలియజేస్తాడో,
  3. పవన్‌కల్యాణ్ తన పవర్‌ను తన ఒక్కడి దగ్గరే వుంచుకొకుండా, ఎంతమందిని నమ్మి తన పవర్‌ను డిస్ట్రిబ్యూట్ చేస్తాడనేది

కాలమే సమాధానం చెపుతుంది.

bottomline:
thanks to technology

Filed Under: Pawan Kalyan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *