లక్కీ నాగార్జున

lucky nag

నాగార్జున, కార్తీ హిరోలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఊపిరి’. తమన్నా హీరోయిన్‌. మార్చి 25న ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే అంతటా పాజిటివ్ బజ్ ఉంది. ఇక ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా నేటితో సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని రిలీజ్‌కు పూర్తి స్థాయిలో సిద్ధమైపోయింది. సెన్సార్ బృందం ఈ సినిమాకు క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ జారీ చేసింది.

గీతాంజిలి
శివ

అన్నమయ్య
రామదాసు
షిరిడీ సాయిబాబ

మనం

ఈ సినిమాలు చేసి, జనాలను మెప్పించడం అంటే, కచ్చితంగా లక్కీ నాగార్జున అనోచ్చు. ఇప్పుడు “ఊపిరి” సినిమా కచ్చితంగా పై సినిమాల లిస్టులో చేరుతుందని సినిమా యూనిట్ మొత్తం చాలా కాన్ఫిడెన్స్‌గా వున్నారు.

“బృందావనం” సినిమా ఎన్.టి.ఆర్ కు మంచి క్లాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. “ఎవడు” సినిమా చరణ్‌కు మాస్ ఇమేజ్ మరింత స్ట్రాంగ్ చేసింది. కాని పైడిపల్లి వంశీకి మాత్రం రావల్సినంత పేరు రాలేదు. “ఊపిరి” సినిమా ద్వారా ఆ లోటు తీరుతుందని నాగార్జున అంటున్నాడు.

“క్లాస్ సినిమా .. మాస్‌కు ఎక్కదు” అనే ప్రిరిలీజ్ ఎక్సపెటేషన్స్‌కు, ఈ సినిమాకు నెగిటివిటీ ప్రొబల్మం వుంది. మన తెలుగు నెటివిటీకి తగ్గా చేసిన మార్పులు క్లిక్ అయితే, నాగార్జున్ లక్ తోడయ్యి రెండు బాషాల్లోనూ మంచి కలక్షన్స్ సాధించే అవకాశం వుంది.

Filed Under: Extended FamilyFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *