లక్ష్యం నెరవేరుతుంది

telugu

అప్పట్లో పవన్‌కల్యాణ్ జానీ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో, ఇప్పుడు రాజమౌళి బాహుబలి కోసం వెయ్యి రెట్లు ఎక్కువ కష్టపడుతున్నాడు. పవన్‌కల్యాణ్ తన విజన్‌తో ప్రేక్షకులను మార్చేద్దాం అని ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. రాజమౌళి మాత్రం ప్రేక్షకులను మార్చేద్దాం అని కాకుండా, ప్రేక్షకులకు ఏది కావాలో అదే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

బాహుబలి సినిమా ప్రేక్షకుల ప్రశంసలతో పాటు రెండు భారీ లక్ష్యాలు కూడా వున్నాయి

ఒకటి: తెలుగుసినిమా C/O బాహుబలి
రెండు: తెలుగు వర్షన్ వందకోట్లు

మొదటి లక్ష్యం నెరవేరడం ఖాయం. మళయాళం, తమిళ్ & హింది వర్షన్స్ తెలుగు కంటే బాగా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకు తెలుగులో మాదిరి ఎక్సపెటేషన్స్ ఏమీ వుండవు. రాజమౌళి సత్తా వాళ్ళకు పూర్తిగా తెలియదు. సుడి బాగుండే, కనివిని ఎరుగని రీతిలో సెన్సేషనల్ హిట్ అయ్యే సూచనలు పుష్కలంగా వున్నాయి.

సినిమాపై వున్న హైప్ చూస్తుంటే రెండో లక్ష్యం “వందకోట్లు” కూడా ఈజీనే కాని, తెలుగుసినిమాకు అంత స్టామినా లేదనే మాటలు వినిపిస్తున్నాయి. పెద్ద గ్యాప్ లేకుండానే మరో భారీ బడ్జెట్ మూవీ(మహేష్ బాబు మూవీ) రిలీజ్ కూడా వుంది.

Filed Under: FeaturedబాహుబలిTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *