లాస్ట్ సాంగ్ షూటింగ్‌లో ముకుంద

varunTej

ముకుంద…మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో వరుణ్ తేజ తొలి సినిమా. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు తరువాత శ్రీకాంత్ అడ్డాల తీస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్. పూర్తి స్థాయి ప్రచారం ఇంకా మొదలు పెట్టవలసి వుంది. నాగేంద్రబాబు కూడా ప్రచారం చేస్తాడు కాబట్టి, ఎడ్వాంటేజ్. ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం ప్రస్తుతం హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడాలో లాస్ట్ సాంగ్ ‘అరరే చంద్రకళా… జారెనా కిందకిలా..’ అనే పాటను చిత్రీకరిస్తున్నారు.

Varun Tej Konidela ‏@IAmVarunTej
Shooting arey rey chandrakala with @hegdepooja 🙂 last days of shoot!..#Mukunda

సిరివెన్నెల సీతారామశాస్ర్తి రాసిన ఈ పాటను వరుణ్ తేజ్, పూజా హెగ్డేలపై చిత్రీకరిస్తున్నాం. ఈ పాటకు రాజు సుందరం నృత్యరీతులు సమకూరుస్తున్నారు. సోమవారంతో ఈ పాట షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్ పాటలు స్వరపరిచిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. స్వరాలు మాత్రమే కాదు… సాహిత్యం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. ఈ నెల 24న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం
–నిర్మాతలు

idlebrain jeevi
Mukunda on 24 December and Chinnadana Neekosam on 25 December. Year-end biggies!

“నా గత రెండు చిత్రాలు ఫీల్ గుడ్ మూవీస్. కానీ, ఇది యాక్షన్ ఓరియంటెడ్ మూవీ. చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది. వరుణ్ కి నప్పే కథ. అందుకే నా అంతట నేనే తనని హీరోగా అడిగాను. వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మామూలుగా ఇప్పటివరకు గ్రామీణ నేపథ్యంలోనూ, నగర నేపథ్యంలోనూ చాలా సినిమలు వచ్చాయి. కానీ, పట్టణ నేపథ్యంలో తక్కువ సినిమాలు వచ్చాయి. ఇది, పట్టణాల్లోని యువతరం భావోద్వేగాలు, అక్కడి రాజకీయాలు నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఇది పక్కా యాక్షన్ ఓరియంటెడ్ యూత్ ఫుల్ మూవీ. నిర్మాతలు ఏ విషయంలోనూ రాజీపడలేదు
— దర్శకుడు

Filed Under: Mega Family