లోఫర్‌ని అందరూ మెచ్చుకుంటారు

Share the joy
  •  
  •  
  •  
  •  

Screen Shot 2015-12-15 at 6.10.37 AM

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన మాస్ ఎంటర్ టైనర్ లోఫర్ సినిమా ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టైటిల్‌పై చాలా విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం ఆ టైటిల్ సినిమాకు పెద్ద మైనస్. సినిమా హిట్ అయితే కవర్ అవుతుందెమో కాని, ఓపినింగ్స్‌కు పెద్ద అడ్డంకి అని సినీ ట్రేడ్ అంటోంది.

పూరి జగన్నాధ్ తన తెలివెతేటలు ఉపయోగించి, “మా అమ్మ మహాలక్ష్మీ” అనే టైటిల్ కూడా జనాల మనసుల్లో నాటుకునేలా చేయగల్గాడు. “ఇది తల్లీకొడుకుల సెంటిమెంట్‌ కథ అని, కుటుంబ సభ్యులందరూ కలిసి చూడదగ్గ సినిమా” అని పదే పదే చెపుతున్నాడు. లోఫర్ చాలా మంచోడు & లోఫర్‌ని అందరూ మెచ్చుకుంటారని కూడా అంటున్నాడు. ఆ టైటిల్ పెట్టడం దేనికి? ఈ తిప్పలు పడటం దేనికి?

ఇది పక్కా మాస్ సినిమా. ఎంతో బాగుంటే కాని, క్లాస్ జనాలు పాజిటివ్‌గా చెప్పటం లేదు. ఈ సినిమా కూడా నెగిటివ్ టాక్ వచ్చే ప్రమాదం వుంది. ఈ సినిమాకు వున్న ఒకే ఒక్క పాజిటివ్ థింగ్ “కంచె సినిమా ద్వారా వరుణ్ సంపాదించుకున్న క్లాస్ ఇమేజ్”. ఎంతవరకు ఆ ఇమేజ్ కాపాడుతుందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

Filed Under: Featuredలోఫర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *