“లోఫర్” టైటిల్‌పై విమర్శలు

Puri_Jagannadh-Varun_Tej

‘ముకుంద’ చిత్రంతో హీరోగా పరిచయమైన మెగాబ్రదర్‌ నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ హీరోగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత సి.కళ్యాణ్‌ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ సి.కళ్యాణ్‌ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకంపై నిర్మాణం జరుపుకోనున్న ఈ చిత్రానికి ‘లోఫర్‌’ అనే టైటిల్‌ని కన్‌ఫర్మ్‌ చేశారు.

వరుణ్‌తేజ్ అశ్వనీదత్ చేతుల మీదుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం అన్నది నాగబాబు కల అయితే, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మాస్ హిరోగా పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే 50 కోట్లు హిరోగా నిలవాలన్నది మెగా అభిమానుల కల.

ఆ రెండు కలలు నిజం కాలేదు.

“లోఫర్” అనే చెత్త టైటిల్‌తో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వరుణ్‌తేజ్ హిరోగా ఒక సినిమా మొదలవబోతుందనే న్యూస్ బయటకొచ్చింది.

“ఇడియట్” .. “పోకిరి” టైంలో అభిమానులు ఎలా రెస్పాండ్ అయ్యారో తెలియదు కాని, లోఫర్ అనే టైటిల్ మరీ వరస్ట్‌గా వుందని, మెగా అభిమానులు తీవ్ర అసంతృప్తి తెలియజేస్తున్నారు. ఈ చెత్త టైటిల్‌తో సినిమా చెయ్యనని నితిన్ మంచి చేసాడని కూడా మెగా అభిమానులు నితిన్‌ని అభినందిస్తున్నారు.

“నీ తాత టెంపర్ నీ అయ్యా టెంపర్ బాబాయ్ టెంపర్ నవుఇంక టెంపర్” అనే టైపులో “లోఫర్” టైటిల్ సాంగ్ ఊహకే నీచాతి నీచంగా వుందని మెగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Filed Under: Mega Familyకంచె

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *