లోఫర్ – ఫ్యాన్స్‌కు అంత సీను వుందా?

Loafer

ఒకప్పుడు యంగ్ ఎన్.టి.ఆర్ సినిమాను బాలకృష్ణ ఫ్యాన్స్ చూడోద్దని ప్రచారం చేస్తున్నారనే వార్తలు వచ్చేవి. ఇప్పుడు పవన్‌ఫ్యాన్స్ నాగబాబు కొడుకు “వరుణ్” సినిమాలు చూడోద్దని డిసైడ్ అయ్యారు, సినిమాపై బ్యాడ్ ప్రచారం చేస్తున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఫ్యాన్స్‌కు అంత సీను వుందా? just asking.

పవన్ కల్యాణ్ అంటే కొందరికి వెర్రి అభిమానం. ఆ వెర్రి అభిమానాన్ని ఆపటానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. పూరి జగన్నాధ్ ఒక అడుగు ముందుకేసి పవన్‌కల్యాణ్‌కే మచ్చ అంటున్నాడు. ఇదొక రకమైన బ్లాక్ మెయింలింగ్ అన్నమాట. పూరి తెలివైన వాడు కదా.

వెర్రి.. గోల .. అరుపులు .. ఈలలు .. లేకపొతే ఏ ఫంక్షన్ అయినా సంతాప సభల్లా వుంటాయి. మెగా ఫంక్షన్ అంటే పవన్‌కల్యాణ్ గురుంచి ఒక ముక్క మాట్లాడి, ఆ తర్వాత తమ డబ్బా, తమ సినిమా డబ్బా కొట్టుకొవచ్చు కదా. అంత చిన్న విషయాన్ని డీల్ చేయలేక అభిమానుల ఉత్సాహాన్ని చంపే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు?

మొన్నెదో ఆడియో ఫంక్షన్‌లో అల్లు అర్జున్ డబ్బులిచ్చి మరీ అరిపించుకున్నాడనే విమర్శలు వచ్చాయి. అది నిజం అయితే, ఆ చర్యను ఖండించండి.

అయినా ఈ వెర్రి ప్రతి పబ్లిక్ ఫంక్షన్‌లో చూస్తుందే. అతిధులు మాట్లాడుతుంటే గొడవ చేయటం అనేది ఒక్క మెగా ఫంక్షన్‌లోనే కాదు, ప్రతి పబ్లిక్ ఫంక్షన్‌లోనూ జరిగేదే. ఒక్క పవన్ ఫ్యాన్స్‌నే తప్పు పట్టడం ఇంకా పెద్ద తప్పు. గోల వద్దనుకుంటే, స్టార్ హోటల్లో చేసుకోవాలి.

bottomline:
పవన్‌ఫ్యాన్స్ ఒకరి సినిమా చూడోద్దని ప్రచారం చేసే నీచ స్థితికు దిగజారరు. ఆ విషయం మన తెలుగు మీడియాకు తెలుసు.

Filed Under: Featuredలోఫర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *