లోఫర్ మంచి రిపోర్ట్ వుంది

Loafer

BARaju@baraju_superhit
Loafer censor ayyindi. U/A. Manchi Report undi.

పూరి జగన్నాధ్ ఎప్పటిలానే రెండు నెలల్లో చుట్టిపడేసిన సినిమా లోఫర్. నిజానికి “పోకిరి” కూడా అలా చేసిందే. “దేవుడు చేసిన మనుషులు” కూడా అంతే.లోఫర్ పాటలు విన్నాక, విజువల్స్ చూసాకా “దేవుడు చేసిన మనుషులు” రేంజ్ అని విమర్శకులు డిసైడ్ అయిపొయారు.

పోకిరి మాదిరి సన్సేషనల్ కాదు కదా, అమ్మ నాన్న తమిళ్ అమ్మాయి రేంజ్ హిట్ కూడా అవసరం లేదు. డిజాస్టార్ కాకుండా వుంటే చాలని మెగా అభిమానులు దేవుడిని ప్రార్దిచటం మినహా ఏమి చెయ్యలేని పరిస్థితి.

ఇటువంటి దీనాస్థితిలో బి.ఎ.రాజు లోఫర్ రిపోర్ట్ బాగుందనే ట్వీటు ఎంతో ఆహ్లాదకరంగా వుందని మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ నెల 7వ తేదీన ప్రభాస్ చేతుల మీదుగా ఈ సినిమా ఆడియోని రిలీజ్ చేసారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. వరుణ్ తేజ్ మొదటి సారి పక్కా మాస్ హీరో పాత్రలో కనిపించనున్నాడు. రుణ్ తేజ్ ఓ దొంగగా కనిపించే ఈ సినిమా ద్వారా దిశా పటాని హీరోయిన్ గా పరిచయం కానుంది. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి తరహాలో పూరి మదర్ సెంటిమెంట్ తో రూపొందించిన ఈ సినిమాలో రేవతి, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్ర పోషించాడు. సి కళ్యాణ్ నిర్మాత.

Filed Under: Featuredలోఫర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *