వంద కోట్లు

1

తెలుగులో మగధీర సినిమా వచ్చేదాకా తెలుగు సినిమాకు ఇంత స్టామినా వుందా అనే విషయం తెలియలేదు. మంచి క్వాలిటీతో కూడిన అత్తారింటికి దారేది సి.డి మార్కెట్‌లో విచ్చలవిడిగా వచ్చేసినా, అత్తారింటికి దారేది సినిమా మగధీరను దాటిందంటే నమ్మబుద్ది కావడం లేదు. ప్రేక్షకులు కచ్చితంగా అభినందనీయులు. అటువంటి సినిమా అందించిన త్రివిక్రమ్ & పవన్ కూడా అభినందనీయులు.

ఇంకా అత్తారింటికి దారేది సినిమా చూడని వాళ్ళ కోసం మరియు రిపీట్ ఆడియన్స్ కోసం ఈ సినిమా అదనపు సీన్లు కలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్లాన్ వంద కోట్లు షేర్ రీచ్ అవ్వడానికి ఉపయోగ పడుతుందెమో చూడాలి.

బాహుబలి తో రాజమౌళి కచ్చితంగా వందకోట్లు సాధించడం ఖాయం ఫిక్స్ అయిపొయారు. రాజమౌళి సాధించే లోపు అత్తారింటికి దారేది సినిమానే సాధించేస్తుందా?

సుకుమార్ కూడా 100% లవ్ సినిమాతో, తన ఫార్ములాను విడవకుండానే కమర్షియల్ సక్సస్ వైపు దృష్టి సారిస్తున్నాడు. అత్తారింటికి దారేది కాకపొతే, మహేష్‌బాబు ‘1’ కు పాజిటివ్ టాక్ వస్తే వంద కోట్లు ఖాయం అని కొన్ని ట్రేడ్ వర్గాలు ఊహిస్తున్నాయి.

Filed Under: Extended FamilyFeatured