వరుణ్‌తేజ్‌కు నాగార్జున ఆశ్వీరాదాలు

Screen Shot 2014-12-15 at 7.12.05 PM

సాయి ధర్మ్ తేజ్ చాలా యాక్టివ్. దానికి తోడు దిల్ రాజు & అల్లు అరవింద్ నిర్మాతలు. యూత్ టీం బన్నీ వాసు & హర్షిత్ ప్లానింగ్. “పిల్లా .. నువ్వు లేని జీవితం” పబ్లిసిటీ అదిరిపోయింది.

వరుణ్ తేజ్ బిడియం. నిర్మాతలు ఠాగుర్ మధు & బుజ్జి సరిగ్గా ప్రి రిలీజ్ పబ్లిసిటీ ప్లానింగ్ వున్నట్టు లేదు. పబ్లిసిటీ అసలు లేనట్టుగా వుంది. హైప్ అయితే జిరో. ఇలా పూర్తిగా సినిమా కంటెంట్ మీదే ఆధారపడితే, ప్రేక్షకుల్లో ఈ సినిమా కచ్చితంగా చూడాలని .. సినిమా పిచ్చోళ్ళు పదే పదే చూడలని ఉత్సుకత ఎలా కలుగుతుందో ఈ సినిమా దర్శకనిర్మాతలకే తెలియాలి. సినిమా ఎలా వున్నా ఈ రోజుల్లో పలానా సినిమా రిలీజ్ అవుతుందని తెలియాలంటే పబ్లిసిటీ అవసరం చాలా వుంది. పవన్‌కల్యాణ్ సినిమా వుండటం వలన సంక్రాంతి సీజన్ మిస్ అయ్యింది. దానికి తోడు ఇంత వీక్ పబ్లిసిటీ అంటే థియేటర్స్‌కు వచ్చి ఎవరు చూస్తారు? భారీ ఓపినింగ్స్ ఎక్కడ నుంచి వస్తాయి?

“డైరక్టర్ మంచోడు .. మంచి సినిమాలు తీస్తాడు” అనే పేరు వుంది కాబట్టి “ముకుంద” కచ్చితంగా మంచి సినిమా అవుతుంది. తెలుగు టెలివిజన్ రంగంలో ఒక కొత్త హిస్టరీని క్రియేట్ చేసిన “మీలో ఎవరు కోటీశ్వరుడు?” టి.వి షోను తమ మొదటి పబ్లిసిటీ ప్రొగ్రాంగా ఎంచుకొవడం కూడా బాగుంది. (ఏ ప్రొగ్రాం ఫాలో అప్‌గా కంటీన్యూ పబ్లిసిటీ చేస్తే బాగుండేది.) ఈ సందర్భంగా వరుణ్‌తేజ్‌కు, ఒక తండ్రిగా నాగేంద్రబాబు టెన్షన్‌ను అర్దం చేసుకున్న నాగార్జున ఆశ్వీరాదాలు అందించడం బాగుంది. ఏదైనా పని చేసే ముందు ఒక్క క్షణం ఆలోచిస్తే తప్పేంటని యూత్‌కు ముకుంద సినిమా ద్వారా చెప్పాలనుకుంటున్న దర్శకుడి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారో తెలియాలంటే మరో పది రోజులు ఆగాల్సిందే.

Filed Under: Mega Family