వరుణ్‌తేజ్ “ఆజానుబాహుడు”

varun-tej

ప్రస్తుతం టాలీవుడ్‌లో కొత్త హిరోల ట్రెండ్ నడుస్తుంది. నందమూరి ఫ్యామిలి గాని నుంచి, మెగా ఫ్యామిలి గాని నుంచి వచ్చే హిరోలపై చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొవడానికి వచ్చేస్తున్నారా అనే విమర్శలు వస్తూ వుంటాయి. ఆ విధంగా సాయి ధర్మ్ తేజ్ & వరుణ్ తేజ్ బాగా విమర్శలు ఎదుర్కొన్నారు. సాయి ధర్మ్ తేజ్‌ను అయితే డైరక్ట్ గానే “మీ ఫ్యామిలీ నుంచి ఎంతమంది వస్తారు నాయనా” అని అడిగిన సందర్భాలు వున్నాయని ఇంటర్వ్యూస్‌లో చెప్పాడు.

పై విమర్శలతో పాటు, చెర్రీ & బన్నీలా డాన్స్ చెయ్యాలి. పవన్‌కల్యాణ్‌లా ఫైట్స్ చెయ్యాలనే ఒత్తిడి కూడా వుంది. ఏ మాత్రం తగ్గినా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోతుంది. సోషల్ నెట్‌వర్క్ పుణ్యామా ఇంకా ఎక్కువైంది.

ఈ విమర్శలు, అంచనాలు అసలు కేర్ చెయ్యకుండా నాగబాబు గైడన్స్‌తో సక్సస్‌ఫుల్‌గా వరుణ్ తేజ్ మూడు సినిమాలు “ముకుంద” “కంచె” “లోఫర్” ఫినిష్ చేసాడు. ఈ సినిమాలు ఎంతమందికి నచ్చాయి, ఎంత కలెక్ట్ చేసాయనే విషయాలు పక్కన పెడితే, వరుణ్‌తేజ్ నటుడిగా నిలబడటానికి చాలా ఉపయోగబడ్డాయని చెప్పవచ్చు. క్లాస్ & మాస్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలి ఆడియన్స్ కూడా వరుణ్ తేజ్ నచ్చేలా చేసాయి.

వరుణ్‌తేజ్ నాలుగో సినిమాకు “ఆజానుబాహుడు” అనే టైటిల్ పరిశీలనలో వుందంట. ఆ టైటిల్ క్రిష్ అనుకున్నాడో, మల్లినేని గోపిచంద్ అనుకున్నాడో అనేది మాత్రం ఇంకా తెలియదు. నాలుగో సినిమా డైరక్టర్ ఎవరైనా, ఆ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మిస్తే భారీ క్రేజ్ వచ్చే సూచనలు వున్నాయి. కాని, నాగబాబు ఏమి డిసెషన్ తీసుకుంటాడో వేచి చూడాల్సిందే.

Filed Under: Mega FamilyFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *