వరుణ్ చాలా బాగా చేసాడు

Share the joy
  •  
  •  
  •  
  •  

Varun

టాలీవుడ్ టాలెస్ట్ హిరో వరుణ్ తేజ్. కంచె సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. దర్శకుడు క్రిష్ పూర్తిగా డామినేట్ చెయ్యకుండా వరుణ్ తేజ్‌లో నటనను చూపించే ప్రయత్నం చేసాడు.వరుణ్ తేజ్ హైట్ బాగా ఏడ్వాంటేజ్ అవ్వడంతో కంచె పాత్రలో ఒదిగినట్టు సరిపొయాడు. అందరి ప్రశంసలు అందుకున్నాడు.

కంచె సినిమాలో వరుణ్ పాత్ర ఫుల్ క్లాస్ అని చెప్పుకొవచ్చు. ఇప్పుడు వస్తున్న పూరి లోఫర్‌లో కంచె పాత్రకు ఫూర్తి విరుద్దంగా వుండే మాస్ పాత్ర. వరుణ్ చాలా బాగా చేసాడని దర్శకుడు పూరి జగన్నాధ్ అంటున్నాడు. ఈ సినిమా ద్వారా వరుణ్‌కు మాస్‌లో మంచి పేరు వచ్చినా, ఈ సినిమా విజయం పూరి పైత్యం మీదే ఆధారపడి వుందని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. పూరి అంటే క్లాస్ ప్రేక్షకులు భయపడుతున్న ఈ రోజుల్లో, వరుణ్ సుడి బాగుండి ఏ మేరకు కమర్షియల్ విజయం సాధిస్తుందో చూడాలి.

Filed Under: Featuredలోఫర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *