వాళ్ళు హర్ట్ అవుతారు

Share the joy
  •  
  •  
  •  
  •  

Vaallu

లక్ష్మీ పార్వతిని అడ్డుపెట్టుకొని నారా వారు తెలుగుదేశం పగ్గాలను లాగేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. నందమూరి వారిని ప్రచారం వరకే పరిమితం చేసారు. బాలకృష్ణతో బంధం కలుపుకొని మరింత బలోపితం చేసుకున్నారు. మంచి వాక్‌చాతుర్యం కలిగిన యంగ్ ఎన్.టి.ఆర్ , నారా లోకేష్‌కు పొటీ అవుతాడోనని మొన్న ఎన్నికల్లో ప్రచారానికి పిలవలేదు. పిలవకుండానే చొరవ తీసుకొని వచ్చి, ప్రచారం చెయ్యాలని లోకేష్ మిడియా ముందు అన్నాడు. టైం వాళ్ళది కాబట్టి, ఎమైనా చెల్లుబాటు అవుతాది. ఆ కామెంట్స్‌కు అప్పట్లో అందితే జుట్టు, అందకపొతే కాళ్ళు పట్టుకొవడం చంద్రబాబు దగ్గరనుండి లొకేష్ బాగా నేర్చుకున్నాడనే విమర్శలు కూడా వచ్చాయి.

నాన్నకు ప్రేమతో సినిమా పాటల్లో సోలో సాంగ్ “డోంట్ స్టాప్” అంటూ హీరో తన టీంకి స్పూర్తిని ఇచ్చే పాట ఒకటి వుంది. హై సౌండ్ డ్రమ్స్ తో ఈ సాంగ్ ని స్టార్ చేయడమే ఈ సాంగ్ కి ఊపు తెస్తుంది. చాలా బలమైన పదాలతో చంద్రబోస్ రాసిన ఈ పాట చాలా మందికి స్పూర్తినిస్తుంది. ముఖ్యంగా చరణాలు చాలా బాగున్నాయి. రఘు దీక్షత్ పాడిన విధానం, ఆ వాయిస్ సాంగ్ ని మళ్ళీ వినేలా చేస్తుంది. దేవీశ్రీ ప్రసాద్ పాప్ సాంగ్ స్టైల్ లో కెట్టెల్ డ్రమ్, వెస్ట్రన్ డ్రమ్స్, మరకస్ సౌండింగ్ తో పాటు మధ్య మధ్యలో ఎలక్ట్రిక్ గిటార్ మరియు ఫ్లూట్ ని వాయించిన విధానం సూపర్బ్ అనిపిస్తుంది.

ఆ పాట విన్న వాళ్ళందరికీ వాళ్ళే గుర్తు వస్తారని,
వాళ్ళు వింటే, వాళ్ళు నిజంగా హర్ట్ అవుతారనే ప్రచారం జురుగుతుంది.

సినిమా రిలీజ్ అయ్యేదాకా, ఇలాంటి కామెంట్స్ సహజమే. దురదృష్టవశత్తూ ఈ పాట వింటుంటే, నారా వారు గుర్తు వస్తున్నారు కాని, ఈ పాటను ఎవరైనా తమ తమ జీవితాలకు అన్వయించుకోవచ్చు. very good lyrics by Chandrabose.

ఖేలో ఖేలో ఖేలో రే
ఖేల్ ఖతం అయ్యేదాకా డోంట్ స్టాప్ రే
ఖేల్ ఖతం అయ్యేదాకా డోంట్ స్టాప్ రే
జీలో జీలో జీలో రే
జిందగీ ని ఈదేదాక డోంట్ స్టాప్ రే
జిందగీ ని ఈదేదాక డోంట్ స్టాప్ రే
లక్కొచ్చి డోర్ నాక్ చేస్తాదని
వెయిట్ చేస్తూ యు డోంట్ స్టాప్
షిప్పొచ్చి నిను సేవ్ చేస్తాదని
స్విమ్మింగ్ చేయడం యు డోంట్ స్టాప్
డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఇట్ నౌ
డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఇట్ నౌ
డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఇట్ నౌ
డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఇట్ నౌ

వాళ్ళు నిన్ను విసిరేసామాని అనుకోని అనుకోని
వాళ్ళకి తెలీదు నువ్వొక బంతివని బంతివని
వాళ్ళు నిన్ను నరికేసామని అనుకోని అనుకోని
వాళ్ళకి తెలీదు నువ్వొక నీటి ధారవని
వాళ్ళు నిన్ను పాతేసామని అనుకోని అనుకోని
వాళ్ళకి తెలీదు నువ్వొక విత్తనమని విత్తనమని
విత్తనమై మొలకెత్తు విత్తనమై మొలకెత్తు
వరదలాగ నువ్వు ఉప్పొంగు వరదలాగ నువ్వు ఉప్పొంగు
హే బంతి లాగా పైపైకెగురు
డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఇట్ నౌ
డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఇట్ నౌ

ఓ జల జల కురిసే వర్షం అంటే ఇష్టం అంటావు
తీరా వర్షం వస్తే గొడుగే అడ్డం పెట్టుకుంటావు
నులి నులి వెచ్చని ఎండలు ఎంతో ఇష్టం అంటావు
తీరా ఎండలు కాస్తే నీడల కోసం పరుగులు తీస్తావు
గల గల వీచే విండ్ అంటేనే ఇష్టం అంటావు
మరి విండే వస్తే విండోస్ అన్ని మూసుకుంటావు
లైఫ్ అంటే ఇష్టం అంటూనే లైఫ్ అంటే ఇష్టం అంటూనే
కష్టానికి కన్నీరు అవుతావా కష్టానికి కన్నీరు అవుతావా
ఎదురీతకు వెనకడుగేస్తావ
డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఇట్ నౌ
డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఇట్ నౌ
డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఇట్ నౌ
డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఇట్ నౌ

Filed Under: Featuredనాన్నకు ప్రేమతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *