విలువలే ఆస్తి

trivikram

Neelima Tirumalasett
‘Viluvale Asthi’ love the tag line from S/O Satyamurthy logo. It conveys a lot.

నీతులు చెప్పేవాళ్ళు ఎక్కువై పొయారు .. పాటించే వాళ్ళు తక్కువై పొయారు.

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కలయికలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘సన్ అఫ్ సత్యమూర్తి. ఇప్పటికే ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్, ప్రీ లుక్ టీజర్ విడుదల చేశారు. ఇప్పుడు టైటిల్ లోగో రిలీజ్ చేశారు. చిత్రానికి ‘విలువలే ఆస్తి’ అని ట్యాగ్ లైన్ పెట్టారు. ప్రీ లుక్ టీజర్, టైటిల్ క్యాప్షన్ తో ఇది పూర్తి స్థాయి కుటుంబ కధా చిత్రమని కన్వే చేశారు.

ఉచితంగా అందించ వలసిన “విద్య” ఇప్పుడు పెద్ద వ్యాపారం.
వైద్యం ఉచితం అనలేము కాని, సేవా కోణంలో చూడవలసిన “వైద్యం” చాలా పెద్ద వ్యాపారం.

సినిమా అనేది పక్కా వ్యాపారం. రిస్క్ తీసుకొని ఎదో మేసేజ్ ఇవ్వాలనుకొవడం అభినందించ తగ్గ విషయం. మేసేజ్ ఇస్తున్నప్పుడు కొన్ని విలువలు పాటించాలి. కాకపొతే చిరంజీవి “ఠాగూర్” సినిమా టిక్కెట్లు బ్లాక్‌లో అమ్మడాన్ని ఎంకరేజ్ చెయ్యడం ఎంత తప్పో, “టెంపర్” సినిమాని సూపర్ డూపర్ అని పొగుడుతూ తమ సినిమాల్లో సాడిజంతో హిరోయిన్‌ను ఎంత అసభ్యంగా చూపించాలో అంతాలా చూపించి, “ప్రేక్షకులు కోరుకుంటున్నారు అలా చెపితేనే చూస్తార”ని కవర్ చేసుకొవడం అంత కన్నా తప్పు. ఎందుకంటే ఆ సినిమాలు ఒక మేసేజ్‌తో కూడుకున్నవి. చెప్పే ముందు మనం పాటించాలన్న సంగతి మర్చిపొతే దానికన్నా దిగజారుడుతనం మరొకటి వుండదు.

ఇప్పుడు త్రివిక్రమ్-బన్నీ “విలువలే ఆస్తి” అంటున్నారు. దానికి తగ్గట్టుగానే హుందాగా ఈ సినిమా విషయంలో వుంటారని సినిమా ప్రేక్షకులు ఆశీస్తున్నారు.

Filed Under: Mega FamilyTeluguసత్యమూర్తి గారి అబ్బాయి