వీరు పొట్లతో పవన్‌కల్యాణ్ సినిమా

pawan-kalyan-veeru-potla-movie

పవన్‌కల్యాణ్ కోసం తయారు చేసిన కథతో హరీష్‌శంకర్ మిరపకాయ్ తీసినట్టు, పవన్‌కల్యాణ్ కోసం తయారు చేసిన కథతో వీరు పొట్ల దూసుకెళ్తా తీసాడు అనే టాక్ ఫిలింనగర్ లో వుంది.

దూసుకెళ్తా కలక్షన్స్ ఎలా వున్నాయో తెలియదు కాని,
సినిమా కథ రొటీన్ అయినా, ఆ కథను నడిపిన విధానానికి వీరు పోట్లకు మంచి పేరు వచ్చింది అని చెప్పవచ్చు. in other words, మిరపకాయ్ సినిమాతో హరీష్‌శంకర్ కు వచ్చిన పేరు కంటే దూసుకెళ్తా ద్వారా వీరు పొట్లకు వచ్చిన పేరు ఎక్కువ అని చెప్పవచ్చు.

పవన్‌కల్యాణ్ హరీష్‌శంకర్‌కు అవకాశం ఇచ్చినట్టు వీరు పోట్లకు ఇస్తాడా అనేది పెద్ద ప్రశ్న. కాకపొతే వీరు పోట్ల పవన్‌కల్యాణ్ సినిమా కోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు ఎక్కడా వీరు పొట్ల ఇంటర్వ్య్స్‌లో వినిపించలేదు.

వీరు పొట్ల కు మంచి కథ & మంచి స్టార్ దొరకాలే కాని కచ్చితంగా బ్లాక్‌బస్టర్ కొట్టించగల సత్తా వున్న రచయిత-దర్శకుడు. ‘బలుపు’ సినిమా నిర్మాతతో పవన్‌కల్యాణ్ చేస్తున్న సినిమాకు వీరు పొట్ల దర్శకుడు అయితే బావుంటుంది.

Filed Under: Pawan KalyanFeatured