వెటకారమా? నిజమా?

sai

ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా కాలంగా విడుదలకి నోచుకోక ఆగిపోయిన సాయి ధర్మ్ తేజ్ మొదటిసినిమా ‘రేయ్‌’. రెండో సినిమాగా ఈ చిత్రాన్ని మార్చి 27న రిలీజ్‌ చేస్తానని వైవిఎస్‌ చౌదరి ప్రకటించాడు. థియేట్రికల్‌ ట్రెయిలర్‌ కూడా లాంఛ్‌ చేసి మరీ రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసాడు. ఈ చిత్రానికి థియేట్రికల్‌ ట్రెయిలర్‌ రిలీజ్‌ చేయడం ఇది మూడోసారి.

ఈ ప్రెస్‌మీట్‌లో సాయి ధర్మ్ తేజ్ మాట్లాడుతూ వెటకారంగా “వై.వి.యస్” అవకాశం ఇస్తే మరో సినిమాకు చేస్తానంటున్నాడు.

వెటకారం ఎందుకనిపించదంటే “పిల్లా .. నువ్వు లేని జీవితం” సినిమా హిట్‌తో ఫుల్ ఫార్మ్‌లో వున్నాడు సాయి ధర్మ్ తేజ్. ఫైనాన్షియల్ ఇష్యూస్‌తో సతమతమవుతున్న వై.వి.యస్ అవకాశం ఇవ్వడం ఏమిటి? పవన్‌కల్యాణ్ వై.వి.యస్ కు ఒక సినిమా చేసి ఆదుకుంటాడని ఫ్యాన్స్ అనుకుంటుంటే. నిజంగా చేసి దర్శకుడిని ఆదుకుంటే మంచిదే కాని, హిరో చేసిన దర్శకుడిని ఇలా వెటకారం చెయ్యడం మంచిది కాదని మెగా అభిమానులు సాయి ధర్మ్ తేజ్‌కు సూచిస్తున్నారు.

Filed Under: Mega FamilyFeaturedTeluguరేయ్