వెస్ట్రన్ ఇండియన్ కౌబోయ్

PK

పవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జానీ’. ఆ చిత్రం ప్లాప్‌ అయి చేదు జ్ఞాపకాన్నే మిగిల్చింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. జాని చిత్రానికి స్క్రిప్టు, డైరెక్షన్‌ కూడా పవన్‌ చేసాడు. ప్రస్తుతం తాజా చిత్రం సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ చిత్రానికి పవన్‌ కళ్యాణ్‌ స్క్రిప్టు స్వయంగా సమకూర్చుకున్నాడు. డైరక్షన్ మాత్రం పవర్ బాబీకి అప్పగించాడు. ప్రతిసినిమాకు డైరక్టరే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ సినిమాకు మాత్రం పవన్‌కల్యణే కెప్టెన్. బాబీ కేవలం డైరక్టర్ మాత్రమే. పవన్ విజన్ అర్దం చేసుకొని, పవన్ అడిగింది ఇవ్వడమే అతని పని.

ట్రైలర్‌లో కథ మాములుగా వుండటంతో పాటు, చాలా పాత ఫ్లాప్ సినిమాలు గుర్తుకు రావడంతో అందరూ భయపడ్డారు. కథను అంతగా పట్టించుకోవక్కర్లేదు. కథనం ఎలా వున్నదే ఇంపార్టెంట్. పకడ్భంధీగా కథనం వినోదంతో పాటు ఇంటరెస్ట్ క్రియేట్ చేయగల్గితే చాలు.

పవన్ కల్యాణ్ మాటల ప్రకారం, సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ వెస్ట్రన్ ఇండియన్ కౌబోయ్ ఫిలిం. అంటే మన నేటివిటిలో వుండే కౌబోయ్. ఒక సి.ఐ గబ్బర్‌సింగ్ క్యారెక్టరైజేషన్‌తో చేసే అల్లరితో పాటు, సిరియస్‌గా ఒక ఊరిని, ఒక కుటుంబాన్ని పవన్ స్టైల్లో ఎలా కాపాడతాడో తెలియాలంటే ఏప్రిల్ 8 దాకా ఆగాల్సిందే.

పవన్ కల్యాణ్ అభిమానులకు కచ్చితంగా నచ్చే సినిమా అవుతుంది. కాని, మిగతా ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేదాని మీదే అందరి ఆసక్తి వుంది.గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది రేంజ్ కాకపొయినా, బద్రి రేంజ్ అయితే చాలు.

PK

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *