చిరంజీవి వేరు .. పవన్‌కల్యాణ్ వేరు

Chiru-Pawan

దేవుడిని చూడలేము .. కానీ ఫీల్ అవ్వోచ్చు అని చాలా మంది అంటూ వుంటారు. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి ఆలోచనలు 100% మ్యాచ్ కావు. లక్ష్యం ఒక్కటే కావోచ్చు. అటువంటి ఇన్సిడెంట్ ఒకటి “సర్దార్ గబ్బర్‌సింగ్” ఆడియో ఫంక్షన్‌లో గమనించవచ్చు.

బాహుబలి అంతర్జాతీయంగా తెలుగు సినిమాకు పేరు సంపాందించి పెట్టింది అనే మాటలో అసలు నిజం లేదు. హాడావుడి అంతే. నిజానికి జాతీయంగా కూడా గొప్పగా చెప్పుకునే సినిమా కాదు. మాస్ ప్రేక్షకులకు బాగా కిక్ ఇచ్చింది. చీప్ గ్రాఫిక్స్ స్థాయిని తగ్గించాయి.

కొన్ని గొప్ప విజువల్స్‌తో మ్యూజిక్ డామినేట్ చెయ్యడంతో చీప్ గ్రాఫిక్స్ గురించి తక్కువ మాట్లాడుకొవడం జరిగింది. తెలుగువాళ్ళు మనలో మనం బాహుబలి బాహుబలి అని గొప్పలు చెప్పుకొవడంతో పాటు, తెలుగు అంటే C/Oబాహుబలి సినిమా అని నేషనల్ లెవెల్లొ క్రియేట్ చేసిన సినిమా. బాహుబలి క్రియేట్ చేసిన హైప్, ఆ సినిమాను తెలుగువాళ్ళు ఓన్ చేసుకున్న విధానం ప్రతి తెలుగుసినిమాకు ఇన్సిపిరేషన్. కలక్షన్స్ కనివిని ఎరుగని రీతిలో వుండేసరికి బాహుబలి బాహుబలి అంటే, తెలుగులో ఒక పెద్ద థింగ్ కు పర్యాయపదం అయ్యింది.

చిరంజీవి ఆలోచనలు ఎలా వుంటాయంటే, బాహుబలి సినిమాను మించి “సర్దార్ గబ్బర్‌సింగ్” సన్సేషన్ క్రియేట్ చెయ్యాలని, “సర్దార్ గబ్బర్‌సింగ్” ను మించి మరో సినిమా రావాలి.

పవన్‌కల్యాణ్ ఆలోచనలు ఎలా వుంటాయంటే, “సర్దార్ గబ్బర్‌సింగ్” బాహుబలిని దృష్టిలో పెట్టుకొని చేసిన సినిమా కాదు. ఏ సినిమాను క్రాస్ చెయ్యాలని దృష్టిలో పెట్టుకొని చేసిన సినిమా కాదు.

టాప్ స్థానానికి రీచ్ అవ్వడానికి చిరంజీవిది ఒక మార్గం అయితే, పవన్‌కల్యాణ్‌ది ఇంకో మార్గం.

bottomline:
వీళ్ళిద్దరే కాదు, మన తెలుగు హిరోలందరూ ఇదే స్పిరిట్‌తో తమదైన మార్గాల్లో టాప్ స్థానం కోసం కష్టపడుతున్నారు. అంతే కాదు, తమ సినిమాలే కాదు పక్క వాళ్ళ సినిమాలు కూడా బిగ్ సక్సస్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. ప్రస్తుతం మంచి పొటీ వాతావరణం నెలకొనివుంది.

Filed Under: Mega FamilyFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *