వై.వి.యస్ చౌదిరికి సినిమా చేయనున్న పవన్‌కల్యాణ్

yvs-pawan

బొమ్మరిల్లు పతాకంపై వై.వి.ఎస్.చౌదరికి పవన్‌కల్యాణ్ ఓసినిమా చేయనున్నాడని వార్త ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తుంది. దర్శకత్వం బాద్యత కూడా వై.వి.ఎస్ కే ఇవ్వనున్నారా లేదా వేరే వాళ్ళనేవరైనా చేస్తారా అనేది ఇంకా తెలియదంటున్నారు.

మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్, సయామీ ఖేర్, శ్రద్ధాదాస్ ప్రధాన తారాగణంగా బొమ్మరిల్లు పతాకంపై వై.వి.ఎస్.చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రేయ్’ విడుదలకు రెడీగా వుంది. మొదట్లో ఈ సినిమా ఫైన్సాన్స్ చేసింది పవన్‌కల్యాణే అని మాటలు వినిపించాయి కాని, ఇప్పుడు మాత్రం వై.వి.యస్సే కష్టపడి అప్పులు తెచ్చి ‘రేయ్’ నిర్మించాడని టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమాకు వై.వి.యస్ కష్టపడిన తీరు పవన్‌కల్యాణ్‌కు బాగా నచ్చి, వై.వి.యస్‌కు అవకాశం ఇచ్చాడని అంటున్నారు. ఈ సినిమా సంపత్‌నంది సినిమా కంటే ముందే వుంటుందని కూడా అని అన్నారు కాని, సంపత్‌నంది మూవీ పూజా కార్యక్రమాలతో ఆ వార్తలకు ఫుల్‌స్టాఫ్ పెట్టారు.

పవన్‌కల్యాణ్ అల్రెడీ కమిట్ అయిన్ పివిపి సినిమాస్ సినిమా కంటే ముందు వుంటుందా? ఆ తర్వాత వుంటుందా? లేదా కలిసి చేస్తారా? అసలు ఈ వార్తలు అన్నీ కల్పితాలేనా? అనే విషయాలు తెలియాలి.

Filed Under: Pawan KalyanFeatured