శభాష్ అల్లు అర్జున్

అభిమానించడం అభిమానుల వీక్‌నెస్. ఒక్కసారి అభిమానించడం మొదలుపెడితే జీవితాంత కాలం సొంత ఫ్యామిలీ కన్నా ఎక్కువ ప్రేమిస్తారు, అభిమానిస్తారు. వీరాభిమానుల సంగతి అయితే, ఇక చెప్పక్కర్లేదు. అభిమానించే వాళ్ళ కోసం ప్రాణాలివ్వడానికైనా సిద్దమే.

తెలుగులో అటువంటి అభిమానులు, వీరాభిమనులు ఎవరికి ఎక్కువంటే టక్కున వచ్చే సమాధానం “చిరంజీవి”.

వీరాభిమనులు చేసే కొన్ని అతిచేష్టలు వలన, అభిమానులంటే లోకువ. ఫోటో మీటులు ఆశచూపుతూ, వాళ్ళ చేత రక్త దానం, నేత్ర దానం చేయించడం ద్వారా, మెగా అభిమానులకు ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చిన హిరో “చిరంజీవి”.

మెగా అభిమానులు = చిరంజీవి అభిమానులు

చిరంజీవి తమ్ముడిగా పవన్ కల్యాణ్ ను సపోర్ట్ చేసిన మెగా అభిమానుల్లో, కొందరు పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం నచ్చి, పవన్ కల్యాణ్ ను చిరంజీవి కంటే ఎక్కువ ఇష్టపడటం మొదలు పెట్టారు. తొలిప్రేమ, తమ్ముడు, బద్రి & ఖుషి చిత్రాల హిట్ తో పవన్ కల్యాణ్ కంటూ సొంత ఇమేజ్, సొంత అభిమానులు కూడా తయారయ్యారు.

ఎంత మంది సొంత అభిమానులు వున్నా, మెగా అభిమానుల సపోర్ట్ ఎంతో బలం. మెగా ఫంక్షన్స్ లో అరిచేది వాళ్ళే. పవన్ కల్యణ్ ను అమితంగా ఇష్టపడే మెగా అభిమానులు.

ఈరోజు అల్లు అరవింద్ ఇండస్ట్రిలో ఇంత స్ట్రాంగ్ గా వుండటానికి కారణం “చిరంజీవి”. అది ఎంత నిజమో, చిరంజీవి మెగాస్టార్ అవ్వడంలో అల్లు అరవింద్ ప్లానింగ్ మేజర్ రోల్ అనేది అంతే నిజం. చిరంజీవిని విమర్శించాలనుకునే వాళ్ళు, అల్లు అరవింద్ ని విమర్శించే వాళ్ళు. మెగా అభిమానులు కూడా అల్లు అరవింద్ ని విమర్శిస్తూ వుంటారు. ఆ విమర్శలను అల్లు అరవింద్ కాని, ఎవరూ కూడా అంత సిరియస్ గా తీసుకునే వాళ్ళు కాదు. చిరంజీవికి అల్లు అరవింద్ ఒక కవచంలా పని చేసాడు.. అల్లు అరవింద్ ను ట్రీట్ చేసినట్టుగానే అల్లు అర్జున్ ను కూడా మెగా అభిమానులు వాడుకుంటూ వుంటారు.

పవన్ కల్యాణ్ గురించి చిరంజీవిని ప్రతి మెగా ఫంక్షన్లో అడిగే అలవాటు మెగా అభిమానులకు ఎప్పటినుండో(best example: ఇంద్ర 100 డేస్ ఫంక్షన్) వుంది. చిరంజీవి రాజకీయ ఘోర వైఫల్యంతో ఎన్నో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు సహనంతో చిరునవ్వుతో చక్కాగా పవన్ కల్యణ్ గురించి చెప్పే చిరంజీవిలో కూడా అసహనం మొదలయ్యింది.

చిరంజీవి అసహనాన్ని కరెక్ట్ గా క్యాచ్ చేసిన అల్లు అర్జున్, చిరంజీవిని అడ్డు పెట్టుకొని మెగా అభిమానులను ఘోరాతి ఘోరంగా అవమానించాడు. చాలా తెలివితో ఇండైరక్ట్ గా చిరంజీవికి దెబ్బేసాడు. మీడియా ఫోకస్ అంతా పవన్ ఫ్యాన్స్ ని అవమానించాడనుకుంటుంది.నిజమైన పవన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని పట్టించుకునేంత సీను లేదు. ఒకరి అపజయాన్ని ఎంజాయ్ చేసేవాడు నిజమైన పవన్ కల్యాణ్ ఫ్యాన్ కానే కాదు. సోషల్ నెట్ వర్క్ లో హడావుడి చేసేదంతా అవమానంగా ఫీల్ అయిన మెగాఫ్యాన్సే.

“ఏ హిరో సినిమా అయినా, కేవలం ఫ్యాన్స్ చూస్తేనే అంత పెద్ద విజయాలు కావు. అందరికీ నచ్చాలి, అందరూ చూడాలి” అనేది జగమెరిగిన సత్యం. ఇదేదో తనే కనిపెట్టినట్టు, అల్లు అర్జున్ సరైనోడు సినిమా నుంచి కొత్త రాగం మొదలుపెట్టాడు.

అదే రాగాన్ని దువ్వాడ జగన్నాధం సినిమా ప్రిరిలీజ్ పబ్లిసిటీలో కంటీన్యూ చేసాడు. మెగాఫ్యాన్స్ ఊసే లేకుండా “అందరూ చూస్తారు అందరూ చూస్తారు” అనే రాగంతోనే “DJ దువ్వాడ జగన్నాధం” చూడండని మెగాఫ్యాన్స్ ను అడుక్కోకుండా రిలీజ్ చేసేసాడు. శభాష్ అల్లు అర్జున్.

దువ్వాడ జగన్నాధం ప్రిమియర్ షో రిపోర్ట్స్ చాలా బాగున్నాయి.

bottomline:
అల్లు అర్జున్ ఇదే కాన్ఫిడెన్స్ తో ముందు సాగాలి. తండ్రిలా అందరి చేత విమర్శలు ఎదుర్కొంటూ, మెగా ఫ్యామిలీకి ఒక బానిసలా కొనసాగకూడదు.

Filed Under: DJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *  • Warning: file_get_contents(http://pawanfans.com/gallery3/index.php/randimg?size=fullsize&width=120&album=pawanfans) [function.file-get-contents]: failed to open stream: Connection refused in /homepages/39/d267182913/htdocs/home/wp-content/plugins/execphp.php(44) : eval()'d code on line 5