శివమ్ ఆడియో సూపర్

Share the joy
  •  
  •  
  •  
  •  

Shivam

ఏ సినిమా ఆడియో వచ్చినా రొటీన్ రొటీన్ అనటం రొటీన్ అయిపోయింది. కాసేపు రొటీన్ అనే పదం పక్కన పెడితే శివమ్ ఆడియో సూపర్ వుంది. ఒక మాస్ సాంగ్, ఒక ఎవరేజ్ సాంగ్ కాకుండా మూడు ఇనిస్టెంట్ హిట్ సాంగ్స్ వున్నాయి. ఇనిస్టెంట్ హిట్ సాంగ్స్ అంటే మరీ జల్సా రేంజ్ కాదు. కచ్చితంగా ఈ మధ్య కాలంలో వినంగానే నచ్చే అల్భం. శ్రీమంతుడు తర్వాత మరో దేవిశ్రీ ప్రసాద్‌కు మరో హిట్ అల్భం.

  1. “శివమ్ శివమ్” అంటూ సాగే టైటిల్ సాంగ్ కోసం దేవిశ్రీ ప్రసాద్ వాడిన ఇన్స్ట్రుమెంట్స్, క్యాచీ పదాలను వాడుతూ హీరో క్యారెక్టరైజేషన్‌ను తెలియజేస్తూ భాస్కరభట్ల అందించిన సాహిత్యం & కార్తీక్ వాయిస్‌ ఇనిస్టెంట్ హిట్ అయ్యేలా చేసాయి.
  2. “ప్రేమ అనే ఒక పిచ్చి”’ అంటూ సాగే ఈ పాటను ఆల్బమ్‌లో ది బెస్ట్ సాంగ్‌గా చెప్పుకోవచ్చు. ‘ప్రేమ అనే ఒక పిచ్చి’ అనే లైన్‌ను నరేంద్ర పాడిన విధానంతోనే ఈ పాటలోని అసలైన కిక్ మొదలవుతుంది. నాగార్జున & రమ్యకృష్ణ ల అల్లరి అల్లుడు సాంగ్ “నిన్ను రోడ్డు మీద చూసినాది లగాయిత్తు” గుర్తుకు తెస్తుంది. ఇనిస్టెంట్ హిట్.
  3. “ఐ లవ్‌ యూ టూ” అంటూ వచ్చే పాట ఇనిస్టెంట్ హిట్.
  4. “అందమైన లోకం” అంటూ సాగే పాట బాగానే వుంది కాని, ఎవరేజ్ అనిపిస్తాది.
  5. “గుండె ఆగి పోతాందే” .. మాస్ సాంగ్. బిలో ఎవరేజ్.

Filed Under: Extended Family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *