శ్రీమంతుడుకిస్వాగతం

first look

“బాహుబలి”కి ఎంత స్టామినా వుందో, “శ్రీమంతుడు”కి అంతే స్టామినా వుంది. రెండు సినిమాలు వంద కోట్లు షేర్ సాధించడానికి టార్గెట్ చేసి నిర్మింపబడుతున్నవే. కాకపొతే, ఈ రెండు సినిమాలూ ఒకే టైంకు రెడీ అవ్వడం రెండు సినిమాలకు మంచిది కాదు. కాని ఒక నెల గ్యాప్‌లోనే ఈ రెండు సినిమాలు వచ్చేట్టు వున్నాయి.

“బాహుబలి”కి ఎన్నో పోస్టర్స్ రిలీజ్ చేసి క్రియేట్ చేసిన హైప్, శ్రీమంతుడు ఈ ఒక్క పొస్టర్‌తో బీట్ చేసాడని చెప్పవచ్చు.

రెండు పెద్ద సినిమాలు అంటే, ఎంత గ్యాప్ వుంటే అంత మంచిది.

అలా కాకుండా మహేష్‌బాబు సినిమా రిలీజ్ రోజే రామ్‌చరణ్ రెండు సినిమాలు “నాయక్” & “ఎవడు”, మహేష్‌బాబు సినిమాలతో పొటీ పడి, పై చేయి అనిపించుకున్నా, ఆ సినిమాల టాక్‌కు తగ్గట్టు కలక్షన్స్ సాధించలేకపొయినా విషయం అందరికీ తెలిసిందే. ఓవర్‌సీస్ అయితే, రామ్‌చరణ్ సినిమాలు పట్టించుకున్న నాధుడే లేడు.

శ్రీమంతుడు జూలై కన్‌ఫార్మ్ అయితే, బాహుబలిని ఆగష్టుకు మూవ్ చేసుకొవడం బెటర్ అంటున్నారు తెలుసినిమా ప్రేమికులు.

Filed Under: Extended FamilyFeaturedTeluguశ్రీమంతుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *