శ్రీమంతుడు – అమెరికా కలక్షన్స్

Srimanthudu

ఆగస్టు 7న విడుదల కానున్న మహేష్ బాబు తాజా చిత్రం ‘శ్రీమంతుడు’ ఆడియోని జూలై 18న ఘనంగా విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకను హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక లో చేయాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఉర్రూతలూగిస్తుందని అంచనాలు వేస్తున్నారు. ‘శ్రీమంతుడు’ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి… ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ ఇంతకు ముందు ప్రభాస్ కు ‘మిర్చి’తో అదిరిపోయే విజయాన్ని అందించాడు… ఆ దిశగా ఆలోచిస్తే- మహేశ్ బాబుకు అంతకంటే మిన్నయైన విజయాన్ని కొరటాల శివ అందిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

మైత్రీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ‘శ్రీమంతుడు’ చిత్రం సకుటుంబ సపరివార సమేతంగా చూడతగ్గ చిత్రమని యూనిట్ సభ్యులు చెబుతున్నారు… దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

బాహుబలితో అమెరికాలో రియల్ తెలుగుసినిమా స్టామినా అర్దం అయ్యింది. ఇప్పుడు శ్రీమంతుడు అమెరికా కలక్షన్స్ ఏ రేంజ్‌లో వుండబోతాయోన్నదే అందరి చూపులు నెలకొనివున్నాయి.

Filed Under: Featuredశ్రీమంతుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *