శ్రీమంతుడు ఆడియో రివ్యూ

Srimanthudu

మ‌హేష్‌బాబు, శృతిహాస‌న్ జంట‌గా మిర్చి ఫేం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలోతెర‌కెక్కిన సినిమా శ్రీమంతుడు. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం. పెద్ద హిరో అంటే ఆడియో ఫ్లాప్ అంటూ వుండదు. “రొటీన్” “ఎక్సపెక్ట్ చేసినంత లేవు” అనే కామెంట్స్ మాత్రం వినిపిస్తూ వుంటాయి. సెన్సెషనల్ అల్భం కాదు, సినిమా హిట్‌ను బట్టి ఆడియో రేంజ్ వుంటుంది. అన్నీ సాంగ్స్ బాగానే వున్నాయనిపిస్తాయి.

1.రాములోరు వ‌చ్చినాడురో…శివ‌ధ‌న‌స్సు విరిచినాడురో…రామ‌రామ‌రామ‌: అల్భంలో బెస్ట్ సాంగ్. “అల్లుడా మజాక” సినిమా లో రాముల వారి సాంగ్ రేంజ్‌లో వుంది. పిక్చరైజేషన్ ఇండోర్ కావడం కొద్దిగా నిరుత్సాహ పరిచినా, పాట్ ఫస్ట్ టైం విన్నప్పుడే నచ్చే సాంగ్.

2. జత కలిసే: దేవిశ్రీ ప్రసాద్ అంటే ఇటువంటి సాంగ్ ఒకటి గ్యారంటీ. ఇటువంటి రకం పాటల్లో ఖడ్గం సినిమాలో “నువ్వే నువ్వే” పాట మొదటి స్థానంలో వుంటుంది. అటువంటి పాటకు మిర్చి “కాటుక కళ్ళు” పాట లాంటి విజువల్స్ చూపించడం బాగుంది. ఈ పాట వింటున్నప్పుడు సింగర్ సాగర్ గుర్తుకు రాకపొతే సూపర్ సాంగ్.

3. చారుశీల: శ్రుతి హసన్ ఫెవరెట్ సాంగ్ అని అంటుంది. మహేష్ బాబు డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. మంచి క్లాస్ స్టెప్స్ పడినట్టు వున్నాయి.

4. జాగో జాగోరే జాగొ: మహేష్ బాబు ఫెవరెట్ సాంగ్. 1 ‘who are you’ సాంగ్ గుర్తుకు వస్తుంది. ప్రత్యేకత ఏమీ వినిపించలేదు. పిక్చరైజేషన్ ప్రత్యేకత ఏమైనా వుందేమో సినిమా వస్తే గాని తెలియదు.

5. ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపొద్దో: ప్రత్యేకత ఏమీ లేకపొయినా బాగానే వుంది. ఎవరేజ్.

6. శ్రీమంతుడా: అధ్భుతం. సినిమా వచ్చాక మిర్చి సాంగ్‌ “పండగలా దిగి వచ్చావు” ను మించి హిట్ అవ్వుద్ది.

Filed Under: Featuredశ్రీమంతుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *