షూటింగ్ మొదలవ్వకుండానే రిలీజ్ డేట్

RamCharan

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందే చిత్రం ఈ గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య డి.వి.వి. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్‌ సరసన నాయికగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటిస్తున్న ఈ చిత్రంలో మరో కీలక పాత్రకు కృతి కర్బందా ఎంపికైంది. ‘తీన్‌మార్‌’లో పవన్‌కల్యాణ్‌ జోడీగా నటించిన ఆమె, ఈ చిత్రంలో చరణ్‌ సోదరిగా కనిపించనుండటం విశేషం.

యాక్షన్‌ మేళవించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాం. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబవుతుంది.

దర్శకుడు శ్రీను వైట్ల

శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్‌, గోపీమోహన్‌ది విజయవంతమైన కాంబినేషన్‌. ఆ కాంబినేషన్‌తో ఈ సినిమా రూపొందుతుండటం ఆనందంగా ఉంది. రెగ్యులర్‌ షూటింగ్‌ మార్చి 16 నుంచి హైదరాబాద్‌లో జరుగుతుంది. అక్టోబర్‌ 15న చిత్రాన్ని విడుదల చేసే దిశగా నిర్మాణ కార్యక్రమాలను ప్లాన్‌ చేస్తున్నాం.
నిర్మాత దానయ్య

Filed Under: Mega FamilyFeaturedTelugu