సన్నాఫ్ సత్యమూర్తి రేంజ్

SO-Satyamurthy-Working-Stills-6

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి గా వస్తున్న సినిమా మీద అంచనాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. రేసుగుర్రం విజయంతో మంచి ఊపుమీదున్న బన్నీ.. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు. బన్నీతో పాటు ఈ సినిమాలో సమంత, నిత్యామీనన్, అదా శర్మ, స్నేహ, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, ఉపేంద్ర తదితరులు నటిస్తున్నారు.

కమర్షియల్ విజయమే లక్ష్యంగా చేసిన ఈ సినిమాపై ఇండస్ట్రీ హిట్ రేంజ్ సినిమా అవుతుందని ఎక్సపెటేషన్స్ వున్నాయి. ఆ ఎక్సపెటేషన్స్‌కు తగ్గట్టుగానే బిజినెస్ జరిగింది. బిజినెస్‌కు తగ్గట్టుగానే భారీ రిలీజ్ చేస్తున్నారు.

త్రివిక్రమ్ సినిమా కాబట్టి చెత్త సినిమా కాదు అని డిసైడ్ అయిపొయారు. చెత్త సినిమా కాదంటే దాని అర్దం మినిమమ్ “ఎవరేజ్”.

త్రివిక్రమ్‌కు అత్తారింటికి దారేది సినిమా మాదిరి ఫ్యామిలి సెంటిమెంట్ కథ ఎంచుకొవడంతో జస్ట్ ఎవరేజ్ కాదు, మినిమమ్ హిట్ అనే రేంజ్ ఊహించుకుంటున్నారు.

అల్లు అర్జున్ ఈ కథకు ఎలా సెట్ అవుతాడు? కథా బలం ఎంత? అనే దాని మీదే ఈ సినిమా అసలు రేంజ్ ఆధారపడి వుంది. రేసుగుర్రం సినిమాతో బన్ని మంచి ఊపు మీద వున్నాడు కాబట్టి, ఇక మిగిలింది “కథా బలం ఎంత?”

కథ కొద్దిగా వీక్‌గా వున్నా, అల్లు అర్జున్ ఎనర్జీకి తోడు ముగ్గురు హిరోయిన్లు & భారీ తారాగణం ఈ సినిమా రేంజ్‌ను మినిమమ్ సూపర్ హిట్ అని ప్రేక్షకుల నమ్మకం.

bottomline:
మినిమమ్ సూపర్ హిట్. కథ స్ట్రాంగ్ గా వుండి ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ఇండస్ట్రీ హిట్ రేంజ్ సినిమా అయ్యే సూచనలు పుష్కలంగా వున్నాయి.

Filed Under: Mega FamilyFeaturedTeluguసత్యమూర్తి గారి అబ్బాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *