సమంత అనవసరమైన కామెంట్స్

1nenokkaposter

అత్తారింటికి దారేది థాంక్య్ ఫంక్షన్‌లో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ “ఈ సినిమా పైరసీ ఒక కుట్ర, దీని వెనుక సినీ పరిశ్రమకు చెందిన పెద్దలే వున్నారు. ఒక్కసారి రెండు సార్లు భరిస్తాం, ఇంకా ఎక్కువ చేస్తే తాట తీస్తాం” అని చిన్న వార్నింగ్ తో వదిలేసాడు.

పరువుకు సంబంధించిన విషయం కాబట్టి పవన్‌కల్యాన్ వార్నింగ్‌తో వదిలేసాడని గ్రహించలేని మేధావులు, ఎవరో తెలిసి ఎందుకు చెప్పలేదని పవన్‌కల్యాణ్‌కు ధైర్యం లేదని విమర్శలు చేసారు.

ఇప్పుడు సమంతా కూడా అదే పని చేసింది. తనకు నచ్చని ఒక సినిమా పొస్టర్ గురించి కామెంట్స్ చెయ్యడంలో తప్పు లేదు. కాకపొతే తనకు సంబంధం లేని విషయం అవ్వడంతో పాటు ఇదే రోజు మహేష్‌బాబు ఆడియో పబ్లిసిటి పొస్టర్ రిలీజ్ అవ్వడంతో పెద్ద దూమారం అయ్యింది. రాంగ్ టైమింగ్ అంతే.

ప్రిన్స్ ఫ్యాన్స్ ఊహించినట్టు, నిజంగా పై పొస్టర్ ఉద్దేశించి ఆమె కామెంట్ చేసి వుంటే మాత్రం దారుణం.

Filed Under: Extended FamilyFeatured