సమ్మర్‌కు మూవ్ అయిన కొత్తజంట

kothajanta

అల్లు శిరీష్, రెజినా జంటగా యూత్ ఫుల్ బూతు చిత్రాల దర్శకుడు ‘మారుతి’ దర్శకత్వంలో బూతు డోసు తగ్గించి రూపొందుతున్న చిత్రం ‘కొత్త జంట’. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

గౌరవం చిత్రంతో ప్రేక్షకుల గౌరవాన్ని సొంతం చేసుకోలేకపోయిన ‘అల్లు శిరీష్’ ఈ చిత్రంతో హిట్ అందుకుంటాడని ఫిలింనగర్ వాసులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 14 రిలీజ్ చెయ్యాలని ప్రొడక్షన్ వర్క్ ఆల్‌మోస్ట్ ఫినిష్ చేసారు. పొస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఫిబ్రవరి లోనే రానున్న మరో మెగా మూవీ సాయి ధర్మ్ తేజ్ “రేయ్” కు గ్యాప్ ఇవ్వడానికి ఈ సినిమాను ముందుగా అనుకున్నట్టు ఫిబ్రవరి 14న కాకుండా, మార్చి నెలాఖురున రిలీజ్ చెయ్యాలని నిర్ణయించారంట. విడుదల తేదిని త్వరలోనే ప్రకటించనున్నారు.

మెగాస్టార్ “ఖైది నెం 786″ చిత్రంలో “అటు అమలాపురం ఇటు పెద్దాపురం” అనే పాటను రీమిక్స్ చేసి ఈ సినిమాకు వాడుకోవడంతో మెగా అభిమానుల చూపు కూడా ఈ సినిమాపై పడింది.

Filed Under: Mega FamilyFeatured