సరైనోడు సమ్మర్ భాక్సాఫీస్ కి సరైన సినిమా

AA

Sarrainodu Rocks ‏@SKNonline
కొన్ని సినిమాలకి ట్వీట్స్ మాత్రమే మాట్లడతాయి
కొన్ని సినిమాలకి తెగె టికెట్స్ కూడ మాట్లడతాయి
సరైనోడు సమ్మర్ భాక్సాఫీస్ కి సరైన సినిమా
Day 2 💪😁

అమెరికాలో మెగాఫ్యాన్స్ మినహా థియేటర్‌కు వెళ్ళి రామ్‌చరణ్ సినిమాలు చూసే స్థాయికి రామ్‌చరణ్ ఇంకా చేరుకొలేదు. రామ్‌చరణ్‌కు తోడు ఒక మంచి క్లాస్ డైరక్టర్ వుండాలి & సినిమాకు మంచి వెబ్ రివ్యూస్ రావాలి. అప్పటివరకు అమెరికా కలక్షన్స్‌లో రామ్‌చరణ్ వీక్ అని అనుకొవచ్చు. కృష్ణవంశీ & శ్రీనువైట్లతో చేసిన ప్రయత్నాలు క్లాస్ ప్రేక్షకులకు చేరుకొలేకపొయినా, మహిళా ప్రేక్షకులకు బాగానే ఆకట్టుకున్నాయి. ఒక్క క్లాస్ హిట్ పడితే, మెగాఫ్యాన్స్ సపోర్ట్‌తో రామ్‌చరణ్ బాగా పుంజుకునే అవకాశం వుంది.

అమెరికాలో మెగాఫ్యాన్స్‌కు రామ్‌చరణ్ తర్వాతే అల్లు అర్జున్. రామ్‌చరణ్‌పై చూపించే ప్రేమ అల్లు అర్జున్‌పై వుండదు. హిట్ సినిమాలు వస్తే అందరూ లైక్ చేస్తారు. అల్లు అర్జున్‌కు అదే జరిగింది. జులాయి, రేసుగుర్రం, S/O సత్యమూర్తి & రుద్రమదేవి సినిమాల ద్వారా, అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమాలకు హిట్ టాక్ ప్లస్ డైరక్టర్స్ సపోర్ట్ కూడా వుంది. కామెడీ టైమింగ్ బాగా క్యాచ్ చేసాడు. తన ఎనర్జీతో తనకంటూ ఒక ప్రత్యేక శైలి క్రియేట్ చేసుకోగల్గాడు. నిన్న రిలీజ్ అయిన సరైనోడు సినిమా బాగుందని టాక్ వస్తే కలక్షన్స్ చాలా బాగా వుండేవి కాని, మాస్ సినిమా + ఫ్లాప్ టాక్ అనేటప్పటికి థియేటర్‌కు వెళ్ళి చూడటానికి అందరూ జంకుతున్నారు.

వూర మాస్ సినిమా కావడంతో పాటు మెతాదుకు మించి యాక్షన్ సీక్వీన్సస్ వున్నాయని కొందరు అంటుంటే, మాస్ ప్రేక్షకులను అలరిస్తుందని సరైనోడు సినిమా యూనిట్ వాళ్ళు అంటున్నారు. కొన్ని సినిమాలకు వెబ్ టాక్‌ను బట్టి, ఓవర్సీస్ కలక్షన్స్ బట్టి కాదు .. ఆ సినిమా కోసం తెగుతున్న టిక్కెట్ల సంఖ్య చూడాలని, సరైనోడు సమ్మర్ భాక్సాఫీస్ కి సరైన సినిమా అని అంటున్నారు. 40 కోట్ల క్లబ్‌లో కచ్చితంగా చేరే సినిమానే అంటున్నారు.

అల్లు అర్జున్ “దేశముదురు” సినిమా కూడా ఇదే రకమైన టాక్‌తో మొదలయ్యి మాస్ హిట్ అనిపించుకుంది. సరైనోడు ఫైనల్ రిజల్ట్ & రేంజ్ తెలియాలంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే.

Filed Under: సరైనోడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *