సరికొత్త చరణ్‌ను చూపించే ప్రయత్నంలో కృష్ణవంశీ

chiruthanayudu

చిరుత
మగధీర
ఆరెంజ్

సినిమాల్లో చరణ్ ఏమి చెయ్యగలడు అని చూపించే ప్రయత్నాలు జరిగాయి.

ఆరెంజ్ కమర్షియల్ ఫెయిల్యూర్ దెబ్బకు

రచ్చ
నాయక్
ఎవడు

సినిమాల్లో కమర్షియల్ విజయం సాధించడం పైనే దృష్టి సారించడం జరిగింది. ఈ మూడు సినిమాలు కమర్షియల్ విజయం సాధించడంతో పాటు మాస్‌లో మంచి ఇమేజ్ సంపాదించి పెట్టాయి. రామ్‌చరణ్‌పై ఒత్తిడి తగ్గింది.

ఒకప్పుడు కృష్ణవంశీ C/O క్రియేటివిటి అనేవారు. ఫెయిల్యూర్స్‌లో వున్నాడు కాబట్టి ఇప్పుడు కృష్ణవంశీ C/O పైత్యం & C/O ఇగో అని టాక్ వుంది. వరుస విజయాల్లో వున్న రామ్‌చరణ్‌ కృష్ణవంశీ దర్శకత్వంలో సినిమా చెయ్యడం కరెక్ట్ కాదు అని కొందరంటుంటే, సరికొత్త చరణ్‌ను చూపించే ప్రయత్నంలో కృష్ణవంశీ చేసి విజయం సాధిస్తాడని మరికొందరంటున్నారు.

ఈ సినిమా ద్వారా రామ్‌చరణ్ ఏ ఇమేజ్ సాధిస్తాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేదాకా ఆగాల్సిందే.

Filed Under: Mega FamilyFeatured