సరైనోడిని పట్టించుకొవడం లేదు

AA

Jalapathy Gudelli ‏@JalapathyG
This summer season’s last hope Trivikram’s #AAa releases on 2nd June.

SKN ‏@SKNonline
@JalapathyG why Last hope sir
Already Sarrainodu did Huge Biz
24 & Supreme doing well Na 🙂

సరైనోడు చాలా బాగా ఆడుతుంది. కలక్షన్స్ వర్షం కురిపిస్తున్న మాట వాస్తవం. ఏప్రిల్ మొదట్లో వచ్చివుంటే, ఇంకా బాగా ఆడేది. మెగాఫ్యాన్స్‌కు సర్దార్ గబ్బర్‌సింగ్‌తో సినిమాల మీద విరక్తి రాకపోయి పోయి వుండివుంటే మెగాఫ్యాన్స్ కూడా ఉత్సాహంతో బెనిఫిట్ షోస్ & ఫ్యాన్స్ షోస్ సపోర్ట్ చేసేవాళ్ళు.

సరైనోడిని కలక్షన్స్‌ని ఎవరూ పట్టించుకొవడం లేదు. తెలుగులో 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాలు చాలా వున్నాయి. కాని షేర్ బేస్ మీదే కౌంట్ చెయ్యడం పరిపాటి. ఇప్పటివరకు 100 కోట్లు చేసిన సినిమా ఒక్కటే. అది రాజమౌళి “బాహుబలి”. తెలుగు వర్షన్ బాహుబలి షేర్ 160 కోట్లు అనుకుంట. దాంట్లో సగం చేసిన సినిమాలు రెండే. ఒకటి “అత్తారింటికి దారేది”, రెండు “శ్రీమంతుడు”.

సినిమా పబ్లిసిటీ కోసం సరైనోడు అల్లు అర్జున్ రెండో 100 కోట్ల సినిమా అని జనాలను కన్‌ఫ్యూజన్ చేసారు (గ్రాస్). “వరుడు” “బద్రినాధ్” సినిమాలను కమ్ర్షియల్ హిట్స్‌గా చూపించిన వీళ్ళ ప్రబ్లిసిటీ స్ట్రాటిజీని ఎవరూ తప్పుపట్టలేరు కాని, సరైనోడు విషయంలో నిజం చెపుతున్నా ఎవరూ నమ్మడం లేదు.

మెగాఫ్యాన్స్ ను ఆపార్దం చేసుకొని & చిరంజీవిని అడ్డుపెట్టుకొని “నేను చెప్పను” అనే ఎపిసోడ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ రికార్డ్స్‌కు మెగాఫ్యాన్స్ తొడలు కొట్టడం తగ్గించారు. అది గుర్తించిన అల్లు అర్జున్, తన ట్విటర్లో టాప్#5 అంటూ తనే తొడలు కొట్టడం మొదలుపెట్టాడు. (దూకుడు నిర్మాతల్లో ఒకడైన అనిల్ సుంకర మాటలకు లొంగి, ఇంతకు ముందు మహేష్‌బాబు కూడా దూకుడు మగధీరను కొట్టేసిందని ట్వీట్ చేసి, వీరికి ఇంత రికార్డ్స్ పిచ్చి వుందా అని ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు.)

రివ్యూలు ఎంకరైజింగ్‌గా లేకపొవడానికి కారణం సరైనోడు సినిమాలో వున్న చావులు. ఆ చావులతో పాటు ప్రేక్షకులకు కావల్సిన నచ్చే ఎన్నో అంశాలు వున్నాయనే విషయాన్ని ఇగ్నోర్ చేసారు. అందరూ మూకుమ్మడిగా ఎదో కక్షతో చేసారనుకొవడం కూడా తప్పే. మన కష్టాన్ని ప్రేక్షకులు గుర్తించారు కదా అని ఆనందించడం మానేసి, వీళ్ళను ఎటాక్ చెయ్యడం మంచి పని కాదు. టార్గెట్ రీచ్ అయినపుడు, అడ్డంకులు క్రియేట్ చేసే వాళ్ళను చూసి జాలి పడాలి. పగ తీర్చుకొవాలనుకొవడం సరికాదు. success is a journey not a destination. ‏@JalapathyG మంచి రిపోర్టర్. ఎంత మాట అనేసాడో చూడండి. సరైనోడు ప్రేక్షకాదరణను కంప్లీట్‌గా ఇగ్నోర్ చేసేసాడు.

bottomline:
బాహుబలి రికార్డ్స్ కొట్టినోడే అసలు సిసలైన హిరో. అప్పటివరకు రికార్డ్స్ ఎవరూ పట్టించుకోరు. హిరో కాకపొయినా, ప్రస్తుతం రాజమౌళి # 1 to 10 అన్నది నిజం.

Filed Under: సరైనోడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *