సర్దార్ గబ్బర్‌సింగ్ – inside info

SGS2

  1. ఫుల్ పాజిటివ్ టాక్ లేదు.
  2. “గబ్బర్‌సింగ్” and “అత్తారింటికి దారేది” .. ఆ రేంజ్ సినిమా కాదు.
  3. మరో “జానీ” and “పంజా” అయ్యే సినిమా కూడా కాదు.
  4. “గుడుంబా శంకర్” or “బద్రి” రేంజ్ కావచ్చు.

inside info ఏమిటి అన్నది కాదు ఇంపార్టెంట్. ఆ info నమ్మాలా వద్దా? అనేదే పెద్ద ప్రశ్న… అసలు నమ్మనవసరం లేదు. యాక్టర్ బ్రహ్మాజీ ట్రైలర్ చూసి, ఫ్యాన్స్ చొక్కాలు చించేసుకుంటారని అన్నాడు. కట్ చేస్తే, ఫ్యాన్స్ అప్‌సెట్ అయ్యారు. యాక్టర్ బ్రహ్మాజీ అబద్దం చెప్పాడని అని అనలేము. అలా అనిపించి వుండవచ్చు. నిజం చెప్పే ధైర్యం లేకపోయివుండవచ్చు.

ఒకటి మాత్రం నిజం:
సినిమా కోసం పవన్‌కల్యాణ్ బాగా కష్టపడ్డాడు. పవన్‌కల్యాణ్‌తో పాటు టీమ్ మొత్తం కష్టపడ్డారు. గత నాలుగు నెలలు అయితే, వాళ్ళకు సరిగ్గా నిద్ర కూడా లేదు. కాకపొతే, గబ్బర్‌సింగ్-1 రిలీజ్ అప్పుడు అందరూ హిట్ అవ్వాలని కోరుకున్నారు. అత్తారింటికి దారేది సినిమా రిలీజ్‌కు ముందే లీక్ అవ్వడంతో, అయ్యయ్యో అనుకున్నారు. సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాకు ఫ్యాన్స్ ఎప్పుడు తొడలు కొడదామా, ఎప్పుడు కాలర్స్ ఎగరేద్దామా అని ఎదురుచూస్తుంటే, మిగతా వాళ్ళు పవన్‌కల్యాణ్‌కు సలహాలు ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. రాంగోపాలవర్మ లాంటి వాళ్ళు(hit or flop, he doesn’t even watch, but talks as if he watched) ఫ్యాన్స్‌ను అడ్డుపెట్టుకొని పవన్‌కల్యాణ్‌ను పొగడ్తలతో చంపేయడానికి కాసుకొని కూర్చున్నారు.

bottomline:
ఇంత నెగిటివ్ వేవ్‌లో, 2.75 to 3.25 వెబ్ రేటింగ్స్ ఎక్సపెట్ చేయవచ్చెమో. అలా కాకుండా, డైరక్టర్ బాబీ నిజంగానే పవన్‌కల్యాణ్‌తో కనెక్ట్ అయ్యివుంటే, గబ్బర్‌సింగ్-1ను మించి వుంటుంది.

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

commentscomments

  1. Nagaraju Male says:

    Ur prediction 100% true

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *