సానుభూతి లేకుండా ఇండస్ట్రీ హిట్

AD-2

అత్తారింటికి దారేది’ చిత్రం సింపుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అయినా కానీ మాస్‌, క్లాస్‌ అని తేడా లేకుండా ఆల్‌ సెంటర్స్‌లో ఊపేసింది. ఈ జోనర్‌ సినిమాకి ఇంత రేంజ్‌ వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఉద్యమాల ప్రభావంతో సినిమా రిలిజ్‌లో జాప్యానికి తోడు, రిలీజ్‌కు ముందే పైరసీ జరిగిందన్న సానుభూతి బాగా కలిసొచ్చింది.

“సన్నాఫ్‌ సత్యమూర్తి” సానుభూతి లేకుండా ఇండస్ట్రీ హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్‌తో ఈ సినిమా యూనిట్ వున్నారని వినికిడి. ఇండస్ట్రీ హిట్ రేంజ్ సినిమా అని సినిమా మొదలయిన దగ్గర నుండే ఎంతో నమ్మకంతో బయ్యర్లు వుండటం ఈ సినిమా ప్రత్యేకత. ఆ రేంజ్‌లోనే బిజినెస్ జరిగింది. అదే రేంజ్‌లో భారీ రిలీజ్ చేస్తున్నారు.

  1. ‘అత్తారింటికి దారేది’ తర్వాత త్రివిక్రమ్ డైరక్షన్‌లో వస్తున్న సినిమా S/O సత్యమూర్తి.
  2. ‘రేసుగుర్రం’ తర్వాత అల్లు అర్జున్ హిరోగా వస్తున్న సినిమా S/O సత్యమూర్తి.
  3. ’జులాయి’ తర్వాత త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న సినిమా S/O సత్యమూర్తి.

అందుకే.. మొదలయిన దగ్గర నుండే సన్నాఫ్ సత్యమూర్తి మీద భారీ అంచనాలున్నాయి.

Filed Under: Mega FamilyFeaturedTeluguసత్యమూర్తి గారి అబ్బాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *