సాయి ధర్మ్ తేజ్

mega-family-pictures

మెగా ఫ్యామిలీ నుంచి ముగ్గురు హిరోలు టాప్ హిరోలుగా సెటిల్ అయిపొయారు.

1) పవన్‌కల్యాణ్
2) అల్లు అర్జున్
3) రామ్‌చరణ్

నాగేంద్రబాబు హిరోగా సక్సస్ కాలేదు కాని, కొన్ని సెలెక్టివ్ రోల్స్‌కు బాగా సెట్ అవుతున్నాడు.

ప్రేక్షకులు అంత ఇంటరెస్ట్ చూపించక పొయినా అల్లు శిరీష్ హిరోగా ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. హిరోగా చూడటం కష్టం అంటున్నారు కాని, ఫైనల్‌గా ప్రేక్షకులు ఏ స్థానంలో కూర్చో పెడతారో అల్లు శిరీష్ కష్టం/అదృష్టం మీద ఆధారపడి వుంది.

మరో ఇద్దరు మెగా హిరోలు రాబొతున్నారు. వీళ్ళిద్దరి సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాకపొయినా, కచ్చితంగా సక్సస్ అయ్యే మెగా హిరోలుగానే కనపడుతున్నారు.ఎవరి ప్రత్యేకతలు వాళ్ళకు వున్నాయి.
1) పాత సినిమాల్లో చిరంజీవిని గుర్తుకు తెస్తున్న సాయి ధర్మ్ తేజ్
2) మెగా హిరో ఏకైక పొడుగైన హిరో వరుణ్ తేజ్

సాయి ధరమ్ తేజ్ హీరోగా వై .వి ,ఎస్ చౌదరి నిర్మాణ సారథ్యం లో తీసిన “రేయ్”విడుదల అవ్వకుండానే రెండవ సినిమా “పిల్లా నువ్వు లేని జీవితం”విడుదల అవుతుండడం విశేషం . రెజీనా జంటగా నటిస్తున్న చిత్రంలో జగపతిబాబు కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. బన్ని వాసు, హర్షిత్‌ నిర్మాతలు. అల్లు అరవింద్‌ సమర్పకులు.

వరుణ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ముకంద’. పూజా హెగ్గే హీరోయిన్. ‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లో చెట్లు’ ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. మిక్కి జె.మేయర్ సంగీతం అందిస్తున్నారు. లియో ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు బుజ్జి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా రెడీగా వుంది కాని, మంచి రిలీజ్ టైమ్ కోసం ఎదురుచూస్తున్నారు. క్రిస్టమస్‌కు వచ్చే ఛాన్సస్ వున్నాయి.

Filed Under: Mega FamilyFeaturedరేయ్