సినిమాలు చేసుకొనివ్వండి ..

pawan-kalyan

Pawan Kalyan
‘ఊళ్లు కోసం రోడ్లు వెయ్యడం చూసాం గాని , రోడ్లు కోసం ఊళ్లు తీసెయ్యటం చూళ్ళేదు సారూ!’ – రింగు రోడ్డు లో భూమి కోల్పోయిన పేద నిర్వాసితుడు

ప్రస్తుతానికి తెలుగుదేశం మిడియా సపోర్ట్ వుంది కాబట్టి, పవన్‌కల్యాణ్ ఏమి చేసినా పాజిటివ్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారు. జగన్ మిడియా మాత్రం ఏమి చేసినా లేని అర్దాలు తీసి మక్సిమమ్ డామేజ్ క్రియేట్ చెయ్యడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ పార్టీని .. ఈ పార్టీని .. అడ్డుపెట్టుకొని సంపాదించుకునే వాళ్ళే ఎక్కువ. తెలుగుదేశం నాయకుల ఆగడాలని ప్రశ్నించిన రోజున, పవన్‌కల్యాణ్‌కు చిరంజీవి మాదిరి చుక్కలు చూపించడం ఖాయం. ఈరోజున సపొర్ట్ చేస్తున్న తెలుగుదేశం ఫాలోయర్సే బండ బూతులు తిడతారు.

Pawan Kalyan
అభివృద్ధి అనేది సామాన్యుడిని భాగస్వామి చేసేలా ఉండాలి కాని భయపెట్టేల చెయ్యకూడదు.

అప్పటి హిరాకుడ్ నుంచి ఇప్పటి పోలవరం దాక , అభివృద్ధి ప్రాజెక్టలు వల్లన సామాన్యులు, ఆదివాసీలు నిర్వసితులుగానే మిగిలిపోయారు.

ప్రాజెక్ట్లులు ప్రారంభించటం లో ఉన్న ఉత్సాహం ,పునరావాసం కల్పించటం లో ఏ ప్రభుత్వం చూపలేదు.

మానవీయ కోణం తో కూడిన అభివృద్దే ‘జనసేన’ ఆకాంక్ష!
జైహింద్

చెప్పడానికి బాగుంటాయి. ట్వీట్ చెయ్యడానికి బాగుంటాయి. రిట్వీట్ చెయ్యడానికి బాగుంటాయి. వెబ్‌సైట్లు ఒక న్యూస్ ఐటమ్‌గా వ్రాసుకొవడానికి బాగుంటాయి. టి.విలో ఒక అరగంట ప్రొగ్రాంగా కూడా పనికొస్తాయి.

నిజ జీవతంలో సాధ్యమా? సాధించాలంటే ఎంత పెద్ద విప్లవం(మార్పు) రావాలి? ఎంతమంది నాయకులు తమకు తాము ప్రశ్నించుకొని చిత్త శుద్దితో పనిచెయ్యాలి?

ఇవన్నీ మనకెందుకు? .. పవన్‌కల్యాణ్‌ని సినిమాలు చేసుకొనివ్వండి అంటున్నారు మెగా అభిమానులు.

Filed Under: Pawan KalyanFeaturedTelugu