సినిమా ఫ్లాప్ అయితే తప్పెవరిది?

MHD

దర్శకులు చెప్పిన ఆలోచనల్ని నమ్మి సినిమాలు తీస్తాం. అయితే దర్శకుడు చెప్పిన ఆ కథని తెరకెక్కించాలా లేదా అనే నిర్ణయం నిర్మాతదే. అందుకే అనుకున్న కథతో విజయాన్ని సాధించకపోతే దర్శకుల్ని తప్పు పట్టడం సరికాదు. అది నిర్మాతగా నా తప్పుగా పరిగణిస్తా.

Dil Raju

పబ్లిక్‌లో తనకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వడం లేదన్న అభద్రతా భావంతో, దాసరికి మైకు దొరికితే చిరంజీవిని ఇండైరక్ట్‌గా అనరాని మాటలు అనడం ఎలా అలవాటయ్యిందో, దిల్ రాజుకు లేదా హరీష్‌శంకర్‌కు మైకు దొరికితే చాలు, రామయ్యా వస్తావయ్యా సినిమా ఫ్లాప్ ఫ్లాప్ అని ఆ సినిమాను ఒక వంద సార్లు తలుచుకొవడం అలవాటయ్యిపోయింది.

సినిమా ఫ్లాప్ అయితే తప్పెవరిది?

సినిమా ఫ్లాప్ అయితే ఆ బాద్యత నాది నాది అంటూ, తామేదో పెద్ద పతీతులం అని, ఈ మధ్య సెల్ఫ్ డబ్బాలు కొట్టుకొవడం మరీ ఎక్కువై పోయింది. బాద్యత ఎవరిదో పక్కన పెడితే,

  1. సినిమా ఫ్లాప్ అయితే, తమకు నచ్చే అంశాలు తప్పకుండా వుంటాయనే ఎన్నో ఆశలతో మొదటిరోజు డబుల్ రేటు పెట్టుకొని వెళ్ళే అభిమానులకు సినిమాల మీద విరక్తి రావడం ఖాయం. ఎంత తొందరగా కొలుకోగల్గితే అంత స్ట్రాంగ్ అభిమాని అని అర్దం.
  2. సినిమా ఫ్లాప్ అయితే, సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది, రుపాయికి పది రుపాయల లాభం వస్తుందనుకొని సినిమాను కొనుక్కునే ఎక్సిబిటర్, రోడ్డు మీద బిచ్చం ఎత్తుకునే పరిస్థితి.

bottomline:

  1. అందరికీ సినిమా నచ్చే విధంగా తీస్తే చాలా మంచిధి.
  2. ఒక ఎక్సపరమెంట్ సినిమా చేసి ఫెయిల్ అవ్వడం సహజం. ఎదో కొత్త ప్రయత్నం చేసాడు, వర్కవుట్ కాలేదు అని క్షమించేయవచ్చు.
  3. ఒక కమర్షియల్ సినిమా చేస్తూ, మినిమమ్ అభిమానులకు నచ్చే విధంగా తీయకపొవడం మాత్రం క్షమించరానిది.

Filed Under: Extended FamilyJust4Fun

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *