సినిమా వుంటే పేరు ఎనౌన్స్ చెయ్యండి

Gabbar-Singh-2

సాక్షి: పవన్ కల్యాణ్‌తో మీరు చేయబోయేది ‘గబ్బర్‌సింగ్’కి సీక్వెలా?
సంపత్ నంది: సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ కాదు. జస్ట్ గబ్బర్‌సింగ్ కేరెక్టరైజైషన్ మాత్రమే తీసుకుని అల్లిన వేరే కథ ఇది. జేమ్స్ బాండ్ సినిమాలే తీసుకోండి. అవి వేటికవే ప్రత్యేకం. వాటికీ సీక్వెల్స్, ప్రీక్వెల్స్ ఉండవ్. మా సినిమా కూడా అంతే.

గబ్బర్‌సింగ్ కేరెక్టరైజైషన్‌తో సంపత్‌నంది చేసిన కథ నచ్చక, ఆ ప్లేస్‌లో బాబీతో పవన్‌కల్యాణ్ వర్క్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కథ కోసం ఇన్ని రోజులు స్పెండ్ చెయ్యడం ఏమిటో అని కూడా ఆశ్చర్యపోతున్నారు మెగా అభిమానులు. పొలీస్ ఆఫీసర్ రోల్స్ చూసి చూసి తెలుగు ప్రేక్షకులు విసిగిపొయారని, ఈ సినిమా కాన్సిల్ అయిపొయిందని సంబరాలు చేసుకుంటున్న మెగా అభిమానులు ఈ సినిమా ఇంకా వుందని శరత్ మరార్ ఎనౌన్స్‌మెంట్ చూసి చాలా నిరుత్సాహానికి గురయ్యారు.

గబ్బర్‌సింగ్ సినిమాకు సీక్వెల్ కానప్పుడు, గబ్బర్‌సింగ్-2 అని వాడుతూ జనాలను కన్‌ఫ్యూజన్ చెయ్యడం దేనికి? సినిమా వుంటే పేరు ఎనౌన్స్ చెయ్యండి అంటున్నారు మెగా అభిమానులు.

Filed Under: Pawan KalyanFeaturedTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *