“సుప్రీమ్” పాజిటివ్ టాక్ మాత్రమే కాపాడాలి

Supreme

సాయిధర్మ్‌తేజ్ హీరో గా, రాశీ ఖన్నా హీరోయిన్ గా, ‘పటాస్’ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతోన్న చిత్రం ‘సుప్రీమ్’. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో , శిరీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రం నేడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 5 న భారీ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ లభించింది.

తెలుగు సినిమాల సంఖ్య పెరిగింది. పెద్ద సినిమాల సంఖ్య పెరిగింది. ప్రతి హిరో ప్రతి ప్రొడ్యుసర్ ప్రతి దర్శకుడి వారసులు హిరోలుగా వస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి హిరోల మీద హిరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. మెగా ఫ్యామిలి నుంచి ఇప్పటికే పవన్‌కల్యాణ్, అల్లు అర్జున్ & రామ్‌చరణ్ పెద్ద హిరోలుగా నిలదొక్కుకుంటే .. సాయిధర్మ్‌తేజ్ & వరుణ్ తేజ్ కూడా చిన్న హిరోలుగా సక్సస్ ముద్ర వేసుకొని, పెద్ద హిరోల లీగ్‌లో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

మూడు వారాల వ్యవధిలో మూడు మెగా సినిమాలు అంటే, చివర్లో వస్తున్న సినిమాపై ఆసక్తి తక్కువ వుంటుంది. “సుప్రీమ్” సినిమాను పాజిటివ్ టాక్ మాత్రమే కాపాడాలి.

Filed Under: Featuredసుప్రీమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *