సుప్రీమ్ .. మరో మాస్

supreme

సాయి ధరమ్‌ తేజ్‌, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘సుప్రీమ్‌’ . ‘పటాస్‌’ ఫేమ్‌ అనిల్‌ రావిపూడి దర్శకుడు. దిల్‌ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు. మే మొదటి వారంలో విడుదల అన్నారు కాని, కరెక్ట్ డేట్ చెప్పలేదు. మే 6న లేదా, ఒకరోజు ముందు మే 5న రిలీజ్ కావోచ్చని ఊహాగానాలు చేస్తున్నారు. ఇంత షార్ట్ గ్యాప్‌లో మూడు మెగా సినిమాలు అంటే, పబ్లిసిటీ కష్టం అవుతాది.

సర్దార్ గబ్బర్‌సింగ్ ఫ్లాప్ అయ్యి, సరైనోడు సినిమాకు క్రేజ్ తగ్గించింది. సరైనోడు కూడా ఫ్లాప్ టాక్‌తో మొదలవ్వడంతో, మరో మెగా మూవీ అంటే జనాలు భయపడతారని అంతా అనుకున్నారు. అనూహ్య రీతిలో సరైనోడు ఫ్లాప్ నుంచి హిట్ దిశగా అడుగులు వేస్తుండటంతో “సుప్రీమ్” పై ఆశలు మొదలయ్యాయి.

సుప్రీమ్ కూడా మాస్ సినిమా కావడం మరో విశేషం. సరైనోడు మాదిరి ఫ్లాప్ టాక్‌తో కాకుండా, హిట్ టాక్‌తో మొదలయ్యి, సాయిధర్మ్‌తేజ్ తన రేంజ్ పెంచుకొవాలని మెగా అభిమానులు ఆశీస్తున్నారు.

పూర్తి స్థాయి మాస్ సినిమాలకు ఆదరణ తగ్గుతున్న ఈరోజుల్లో, వూర మాస్ సినిమాగా వచ్చి సరైనోడు హిట్ అవ్వడం, “సుప్రీమ్” సినిమాకు చాలా పెద్ద ఏడ్వాంటేజ్. యముడికి మొగుడు సినిమాలో “అందం హిందోళం” రిమీక్స్ సాంగ్ హైలట్ కానున్నదని సినిమా యూనిట్ ఆశీస్తున్నారు.

Filed Under: Featuredసుప్రీమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *