సుబ్రమణ్యం ఫర్ సేల్

next megastar

మెగాఫ్యామిలీ నుంచి రాబోయే నెక్స్ట్ సినిమా సుబ్రమణ్యం ఫర్ సేల్.

మొదటి సినిమా ‘పిల్లా.. నువ్వులేని జీవితం’ తోనే హిట్ అందుకున్న సాయిధరమ్ తేజ్, అందరూ ఎక్సపెట్ చేసినట్టు రెండో సినిమా “రేయ్” ఫెయిల్ అయ్యింది.

మూడో సినిమా “సుబ్రమణ్యం ఫర్ సేల్” సినిమాకు పవన్‌కల్యాణ్‌కు గబ్బర్‌సింగ్ ఇచ్చిన హరీష్‌శంకర్ దర్శకుడు కావడంతో ఎక్సపెటేషన్స్ భారీగా వున్నాయి. ఈ సినిమాతో సాయి ధర్మ్ తేజ్ రేంజ్ బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Harish Shankar

I personally thank Tv9 & Ujwal …for this on location coverage

ఈమధ్యే ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక షెడ్యూల్ అమెరికాలో మొదలైంది. సుమారు 30 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ మూడు పాటలు చిత్రీకరిస్తున్నారు. ఎప్పట్నుంచో అమెరికాలో షూటింగ్ చేయాలన్నది తన కలని, అయితే ఇప్పటివరకూ తన సినిమాల్లో ఆ అవకాశం రాలేదని, ఈ సినిమా స్క్రిప్ట్‌కి అమెరికా నేపథ్యంలోని సన్నివేశాలు కచ్చితంగా అవసరముండడంతో అక్కడ షూటింగ్ చేస్తున్నామని దర్శకుడు హరీష్ శంకర్ తెలిపారు.

ప్రస్తుతం హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ రెజీనా, బ్రహ్మనందం పాల్గొనగా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. అమెరికాలో షూటింగ్ సందడి సందడిగా జరుగుతోందని, అమెరికాలో ఉన్నా హైద్రాబాద్‌లో ఉన్న ఫీలింగే కలుగుతోందని సాయి ధరమ్ తేజ్, రెజీనాలు తమ అనుభూతులను పంచుకున్నారు.

Filed Under: Mega FamilyFeaturedTeluguసుబ్రమణ్యం ఫర్ సేల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *