‘సూర్య వర్సెస్ సూర్య’

surya1

“స్వామి రా రా”
“కార్తికేయ”
అదే ఊపులో వస్తున్న మరో చిత్రం “సూర్య వర్సెస్ సూర్య”. యువ హీరో నిఖిల్, త్రిధా చౌదరి జంటగా నటించారు.

బేబీ త్రిష సమర్పణలో సురక్షా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివ కుమార్ నిర్మించిన ఈ సినిమా మార్చి 5న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ‘కార్తికేయ’ దర్శకుడు చందు మొండేటి డైలాగ్స్ అందించారు.

పగలు బయటకు రాలేని ఓ కుర్రాడు.. పగలు అంటే ఇష్టపడే అమ్మాయితో ప్రేమలో ఎలా పడ్డాడు. అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. సూర్య కాంతిని తట్టుకోలేని పార్ఫీనియా అనే అరుదైన వ్యాధితో బాధపడే కుర్రాడి పాత్రలో నిఖిల్ నటించాడు. సినిమాలో సస్పెన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ వుంటాయంటున్నారు.

సెన్సార్ కార్యక్రమాలు నేడు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ లభించింది. మంచి సినిమా తీశారంటూ సెన్సార్ బోర్డు సభ్యులు ప్రశంసించినట్టు సమాచారం.(వాళ్ళు అలా అని వుంటారని guessing it from trailers)

Filed Under: Extended FamilyFeatured