సెకండ్ టీజర్

SGS

గబ్బర్‌సింగ్-2 సినిమాలు ఎన్నో వచ్చేసాయి. ఇంచుమించు ప్రతి తెలుగుహిరో గబ్బర్‌సింగ్ లాంటి సినిమా ఒకటి చేసేసాడు. సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలో ఇంకా కొత్తగా చూపించడానికి ఏముందనే అనుమానాలు చాలా వున్నాయి. అనుమానాలు ఎలా వున్నా, పవన్‌కల్యాణ్ ఏమి చెప్పాలనుకున్నాడో అలా చెప్పడానికి వెనుకుంజ వేయకుండా డైరక్టర్ సంపత్‌నందితో మొదలుపెట్టి ఫైనల్‌గా పవర్ ‘బాబీ’ తో చేయించుకుంటున్నాడు. ఫస్ట్ టీజర్లో ఏమీ లేకపొయినా, పవన్‌కల్యాణ్ సింపుల్ స్టైలిష్ వాక్‌కు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తోడయ్యి, అందరినీ ఆకట్టుకుంది.

సెకండ్ టీజర్‌ను చిత్ర యూనిట్ సంక్రాంతి పండగనాడు విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తోంది. శరత్ మరార్ నిర్మాతగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయికగా కాజర్ అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Sardar Gabbar Singh

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *