సెప్టెంబర్ 20న అఖిల్ ఆడియో

akhil

అక్కినేని వంశంలో మూడో తరం నుంచి హీరోగా గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చేందుకు అక్కినేని అఖిల్‌ సిద్ధమవుతున్నాడు !.ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌, అఖిల్‌ను పరిచయం చేసే బాధ్యతను చేపట్టారు. వినాయక్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకంపై హీరో నితిన్‌ నిర్మించారు . ఇప్పటికే స్పెయిన్‌, హైద్రాబాద్‌, థాయ్‌ ల్యాండ్‌లలో భారీ ఎత్తున షూటింగ్‌ పూర్తి చేసుకుంది. అఖిల్‌ సినిమాపై మొదట్నుంచీ భారీ అంచనాలే ఉండగా, ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా రూపొందుతున్నట్లు నితిన్‌, వి.వినాయక్‌ చెబుతూ వస్తున్నారు. సెప్టెంబర్‌ 20న అక్కినేని నాగేశ్వర రావు జయంతి సందర్భంగా ఆడియో ఆవిష్కరణ వేడుకను జరపనున్నారు. అక్టోబర్‌ 23న సినిమా విడుదల. తన మొదటసినిమా సోలోగా ప్లాన్ చేసుకుంటే బాగుండేది కాని, తెలుగుసినిమాల సంఖ్య ఎక్కువ అవ్వడంతో రామ్‌చరణ్ “బ్రూస్‌లీ” సినిమాకు కేవలం ఒక వారం గ్యాప్‌తో రిలీజ్ అవుతుంది. దసరా పండగ సీజన్ కాబట్టి, వారం గ్యాప్‌లో రెండు పెద్ద సినిమాలు పర్వాలేదని అనుకుంటున్నారు.

Filed Under: అఖిల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *