సొంత రాష్ట్రం కాదు కదా

image

సొంత ఊరికి ఏమి చేయనోడు రాష్ట్రానికి ఏమి చేస్తాడని చిరంజీవిని యైయస్సార్ ఒకటికి వందసార్లు అనేవాడు.

“సొంత వాళ్ళు ఎక్కడ సొంతం కాకుండా పోతారేమోనని చిరంజీవి సమాధానం చెప్పేవాడు కాదు”

సొంత కులం
సొంత మతం
సొంత ఊరు
సొంత జిల్లా
సొంత మండలం
సొంత రాష్ట్రం
సొంత మీడియా
సొంత వర్గం

మన రాజకీయాలను ఇలా భ్రస్టు పట్టించేసారు మన నాయకులు.

ఇప్పుడు మోడీ మనకు ఏమి చెయ్యడం లేదని విమర్శించే హక్కు మన నాయకులకు వుందా? (జగన్ కైతే అసలు లేదు)

తిరిగి నిస్సాహయక ప్రజల్ని తప్పు పడుతుంటారు.

ప్రజలు ఏమి చెయ్యలేరు. కాంగ్రెస్ మీద కోపంతో బిజెపిని, బిజెపి మీద కోపంతో కాంగ్రెస్స్ కు ఓట్లు వేస్తారేమో. అంతకు మించి ఏమి చేయగలరు?

“ప్రజలు అగ్రహిస్తారు.ప్రజలు తిరగబడతారు. ” ఇవన్నీ రాజకీయ కల్లబొల్లి మాటలు. నిజమైన నాయకుడు ముందుండి అన్యాయాన్ని నిలదియ్యాలి.

అద్దెకు తెచ్చుకున్న తెలుగుదేశం సపోర్ట్ తప్ప, రాజకీయంగా సొంత సపోర్ట్ లేని పవన్ కళ్యాన్ ఏమి చేస్తాడో చూడాలి.

రాజకీయంగా చిరంజీవి చేసిన తప్పులే పవన్ కళ్యాణ్ కూడా చేస్తాడని, కాకపొతే సరికొత్త స్క్రీన్ ప్లే తో చేయనున్నాడని భవిష్యత్తు తెలిసిన మెగా అభిమానులు ఊహిస్తున్నారు.

Punch line:
కాంగ్రెస్ or బిజెపి or Modi or Sonia
అందరూ దొంగలే.

Filed Under: Pawan KalyanFeatured